AUS vs IND : సిడ్నీ టెస్టు.. తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయి.. చివరిలో దిమ్మతిరిగే షాకిచ్చిన బుమ్రా
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆట పూర్తయింది. అయితే, తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయిగా కొనసాగింది.

AUS vs IND 5th Test
AUS vs IND 5th Test Day1 : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆట పూర్తయింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయిగా సాగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను జస్ర్పీత్ బుమ్రా చేపట్టాడు. రోహిత్ శర్మ వరుస మ్యాచ్ లలో పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నవేళ ఈ టెస్టులో ఆయన్ను పక్కకు తప్పించి జట్టు పగ్గాలను బుమ్రాకు అప్పగించారు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టుకు బుమ్రానే కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. తరువాత మూడు టెస్టుల్లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు పేలవ ప్రదర్శనను కనబర్చింది. అయితే, ఇవ్వాళ్టి టెస్టు విషయానికి వస్తే.. తొలి రోజు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 185 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఆసీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు నిలవలేక పోయారు. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లు అవుట్ అవుతూ పెవిలియన్ బాటపట్టారు. దీంతో రిషబ్ పంత్ (40) మినహా మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేక పోయారు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (10), కేఎల్ రాహుల్ (4) పరుగులు మాత్రమే చేయగలిగారు. శుభమన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (17), రిషబ్ పంత్ (40), రవీంద్రజడేజా (26), నితీశ్ కుమార్ (0), వాషింగ్టన్ సుందర్ (14), జస్ర్పీత్ బుమ్రా (22), మహమ్మద్ సిరాజ్ (3) పరుగులు మాత్రమే చేశారు. దీంతో 72.2 ఓవర్లలో భారత్ జట్టు 185 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. పాట్ కమ్మిన్స్ రెండు, స్కాట్ బోలాండ్ నాలుగు, నాథన్ లైయన్ ఒక వికెట్ పడగొట్టారు.
టీమిండియా ఆలౌట్ అయిన తరువాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి కొన్ స్టాస్, ఉస్మాన్ ఖవాజా వచ్చారు. అయితే, జస్ర్పీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్లో చివరి బంతికి ఉస్మాన్ ఖవాజా (2) ఔట్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి మూడు ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి తొమ్మిది పరుగులు చేసింది. సామ్ కొంస్టాప్ (7) క్రీజులో ఉన్నాడు.
THIS IS TEST CRICKET. 🫡
THIS IS BGT. 🍿
THIS IS CAPTAIN JASPRIT JASBIR SINGH BUMRAH. 🥶pic.twitter.com/eUJXyb1NSO
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2025
Stumps on Day 1 in Sydney!
Captain Jasprit Bumrah with the opening wicket for #TeamIndia 🙌
Australia 9/1, trail by 176 runs.
Scorecard – https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/Z3tFKsqwM2
— BCCI (@BCCI) January 3, 2025