Virat Kohli: మళ్లీ నిరాశపర్చిన విరాట్.. ‘ఇమ్రాన్ హష్మీకి లిప్స్.. కోహ్లీకి స్లిప్స్’ అంటూ నెటిజన్లు ట్రోల్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ నిరాశపర్చాడు. కేవలం 17పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Virat Kohli
IND vs AUS 5th Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ పక్కకు తప్పుకోగా.. జస్ర్పీత్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టాస్ గెలిచిన బుమ్రా బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే, గత మూడు టెస్టుల మాదిరిగానే సిడ్నీ టెస్టులోనూ భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయారు. ఫలితంగా తొలిరోజు 62ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టీమిండియా బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (10), కేఎల్ రాహుల్ (4), శుభమన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (17), రిషబ్ పంత్ (40), రవీంద్ర జడేజా (26), నితీశ్ కుమార్ రెడ్డి (0) వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. విరాట్ కోహ్లీకి ఓసారి అదృష్టం కలిసొచ్చి అవుట్ నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆ తరువాత జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టడంతో విఫలమయ్యాడు. ఈ సిరీస్ ప్రారంభం నుంచి పరుగులు రాబట్టడంలో కోహ్లీ ఘోరంగా విఫలమవుతున్నాడు. దీంతో టీమిండియా మాజీ ప్లేయర్, ఫ్యాన్స్ నుంచిసైతం కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సిడ్నీ టెస్టులో కోహ్లీ క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబడతాడని అందరూ భావించారు. కానీ, సిడ్నీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ నిరాశపర్చాడు.
విరాట్ కోహ్లీ నాల్గో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. మొదటి బంతికే అవుట్ నుంచి తప్పించుకున్నాడు. స్కాట్ బోలాండ్ ఓవర్లో క్రీజులోకి వచ్చిన విరాట్.. మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో బాల్ కోహ్లీ బ్యాట్ అంచును తాకుతూ స్లిప్ ఫీల్డింగ్ లోఉన్న స్టీవ్ స్మిత్ వైపు దూసుకెళ్లింది. స్మిత్ డైవ్ చేసి ఆ బంతిని అందుకునే ప్రయత్నంలో చేతి వేళ్లపైనుంచి గాల్లోకి విసిరాడు. దీంతో స్లిప్ ఫీల్డింగ్ లో ఉన్న మరో ఫీల్డర్ ఆ బంతిని అందుకున్నాడు. అయితే, థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. బంతిని నేలకుతాకే సమయంలో స్మిత్ తన చేతివేళ్లతో గాల్లోకి విసిరాడు. ఆ సమయంలో బంతి నేలను తాకినట్లు రిప్లైలో కనిపించింది. దీంతో కోహ్లీ అదృష్టంశాత్తు అవుటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
Also Read: IND vs AUS 5th test : ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న 52 ఏళ్ల రికార్డు..
ఆ తరువాత ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టేందుకు కోహ్లీ ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగంలేకుండా పోయింది. బోలాండ్ వేసిన బంతిని (31.3వ ఓవర్) ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ ను తాకుతూ బంతి స్లిప్ లోకి వెళ్లింది.. స్లిప్ లో ఫీల్డింగ్ లో ఉన్న వెబ్ స్టర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 69బంతులను ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టి అందర్నీ నిరాశపర్చాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా గత నాలుగు మ్యాచ్ లలో కోహ్లీ పరుగులు రాబట్టడంలో విఫలమవుతూనే ఉన్నాడు. సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లోనూ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆఫ్ స్టంప్ వెలుపల బంతిని ఆడే ప్రయత్నం ఏడుసార్లు ఔటయ్యాడు. దీంతో ప్రతీసారి కోహ్లీ స్లిప్ లో దొరికిపోతుండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ సినిమాల్లో హీరోయిన్ల పెదవులను ఇష్టపడినట్లుగా.. క్రికెట్ లో కోహ్లీ స్లిప్ లను ఇష్టపడుతున్నాడంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ బంతులు వదిలేయడం నేర్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు.
Virat Kohli wicket. 😞#INDvsAUS #AUSvIND #ViratKohli pic.twitter.com/mqCMNWMdA3
— Tanveer (@tanveermamdani) January 3, 2025
Kohli loves slips like Hashmi loves lips pic.twitter.com/N7HVQGu0Ym
— Sagar (@sagarcasm) January 3, 2025
Virat Kohli should learn from Thala how to leave balls outside off-stump.#INDvsAUS #ViratKohli pic.twitter.com/v0UhfsywoC
— Sandarbh Raj Gupta (@Sandarbh_raj8) January 3, 2025