IND vs AUS: సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మను పక్కకు తప్పించారా.. తప్పుకున్నాడా.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే..?

సిడ్నీ టెస్టులో భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు. ఆయన స్థానంలో శుభమన్ గిల్ కు తుదిజట్టులో చోటు దక్కింది.

IND vs AUS: సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మను పక్కకు తప్పించారా.. తప్పుకున్నాడా.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే..?

Rohit Sharma

Updated On : January 3, 2025 / 7:24 AM IST

India vs Australia 5th Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టెస్టు సిడ్నీ వేదికగా ప్రారంభమైంది. ఇప్పటికే నాలుగు టెస్టుల్లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే, ఐదో టెస్టులో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కానీ, జోరుమీదన్న ఆస్ట్రేలియాను అడ్డుకుని సిరీస్ ను సమం చేయాలంటే భారత్ అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. ఇదిలాఉంటే సిడ్నీ టెస్టులో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు. ఆయన స్థానంలో శుభమన్ గిల్ కు తుదిజట్టులో చోటు దక్కింది.

Also Read: Khel Ratna Award : మ‌నుభాక‌ర్, గుకేశ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రికి ధ్యాన్‌చంద్ ఖేల్ ర‌త్న అవార్డు..

గడిచిన మూడు టెస్టుల్లో రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఐదు ఇన్నింగ్స్ లో రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, రోహిత్ శర్మనే తుది జట్టులో నుంచి పక్కకు తప్పుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. సిడ్నీ టెస్టులో రోహిత్ తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆయనకు స్థానం దక్కకపోవటం గమనార్హం. తాజా పరిస్థితులను బట్టిచూస్తే రోహిత్ శర్మకు టెస్టు కెరీర్లో మెల్బోర్న్ లో జరిగిన నాల్గో టెస్టే చివరి టెస్టు అని భావించవచ్చు. టెస్టుల నుంచి అతడు రిటైర్మెంట్ ప్రకటించకపోవచ్చు. కానీ, ఇప్పట్లో సిరీస్ లు లేని నేపథ్యంలో రోహిత్ మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో ఆడడం కష్టం. సిడ్నీ టెస్టులో జస్ర్పీత్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో బుమ్రానే సారథ్యం వహించాడు. ఆ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

Also Read: Virat Kohli – Rohit Sharma : చేతిలో చేయి వేసుకుని న్యూ ఇయ‌ర్ పార్టీకి వెళ్లిన కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌.. రోహిత్ శ‌ర్మ పోస్ట్ వైర‌ల్‌..

టాస్ సమయంలో రోహిత్ శర్మను పక్కన పెట్టడంపై జస్ర్పీత్ బుమ్రా స్పందించాడు. వరుస ఓటముల నుంచి మేము గుణపాఠం నేర్చుకున్నాం. ఈ మ్యాచ్ లో మరింత మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నాం. మా కెప్టెన్ రోహిత్ శర్మ తనకుతానే సిడ్నీ టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ పరిణామం జట్టులో చాలా ఐక్యత ఉందని చూపిస్తుంది. టీమిండియా జట్టులో అహం అనే మాటకు అవకాశం లేదు. జట్టులోని ప్రతీఒక్కరూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారంటూ బుమ్రా పేర్కొన్నాడు. ఇదిలాఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు రోహిత్ శర్మ రెండు రోజుల ముందుగానే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు తెలియజేసినట్లు సమాచారం. అయితే, బీసీసీఐలోని ఓ సభ్యుడు సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మను ఆడించాలని గంభీర్ కు సూచించగా.. ఆ డిమాండ్ ను గంభీర్ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతుంది. రోహిత్, గంభీర్ మధ్య విబేధాల కారణంగానే రోహిత్ ను పక్కన పెట్టడం జరిగిందని, బయటకు మాత్రం రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడని చెబుతున్నారని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు రోహిత్ శర్మకు తుదిజట్టులో చోటు దక్కకపోవడంతో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ బరిలోకి దిగారు.

Also Read: Glenn Maxwell : న్యూ ఇయ‌ర్ తొలి రోజునే.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే గొప్ప క్యాచ్ అందుకున్న మాక్స్‌వెల్..

భారత్ తుది జట్టు: యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ.
ఆస్ట్రేలియా తుది జట్టు : సామ్ కోన్ స్టాప్, ఉస్మాన్ ఖవాజా, లుబుషేన్, స్లీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, వెబ్ స్టర్, అలెక్స్ గ్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బొలాండ్.