PAK vs ENG : 19 బంతుల్లోనే ఇంగ్లాండ్‌పై గెలిచిన పాకిస్థాన్.. మూడేళ్ల తరువాత స్వదేశంలో టెస్టు సిరీస్ విజయం..
దాదాపు మూడేళ్ల తరువాత పాకిస్థాన్ స్వదేశంలో టెస్టు సిరీస్ గెలిచింది.

Pakistan won by 9 Wickets in Rawalpindi test and win the series
PAK vs ENG : దాదాపు మూడేళ్ల తరువాత పాకిస్థాన్ స్వదేశంలో టెస్టు సిరీస్ గెలిచింది. రావల్పిండి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 36 పరుగుల స్వల్ప లక్ష్యంలో బరిలోకి దిగిన పాకిస్థాన్ 3.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ సైమ్ అయూబ్ (8) విఫలం అయినా మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (5)తో కలిసి కెప్టెన్ షాన్ మసూద్ (23; 6 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. తద్వారా మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తేడాతో గెలుపొందింది.
పాకిస్థాన్ జట్టు విజయం సాధించడంలో ఆ జట్టు స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ 20 వికెట్లను సిన్నర్లే పడగొట్టారు. పాక్ స్పిన్నర్లలో సాజిద్ ఖాన్ 10 వికెట్లు తీశాడు. నౌమన్ అలీ 9, జహీద్ మెహమూద్ ఓ వికెట్ సాధించాడు.
IND vs NZ : స్వదేశంలో భారత్ ఎన్ని సార్లు 300 ఫ్లస్ లక్ష్యాన్ని ఛేదించిందో తెలుసా ?
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (89), బెన్ డకెట్ (52) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 6, నౌమన్ అలీ 3, జహీద్ మెహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం సౌద్ షకీల్ సూపర్ సెంచరీతో (134) పాక్ మొదటి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ నాలుగు, షోయబ్ బషీర్ మూడు, అట్కిన్సన్ రెండు, జాక్ లీచ్ ఓ వికెట్ సాధించారు. దీంతో పాక్‌కు కీలకమైన 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఆ తరువాత 77 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 112 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ ముందు స్వల్ప లక్ష్యం నిలిచింది.