పాక్ కెప్టెన్ బలుపు : సౌతాఫ్రికా ఆటగాడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు

మ్యాచ్‌ను గెలిపించేందుకు పోయి పాకిస్తాన్ క్రికెట్‌ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన వన్డేలో జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారానికి కారణమైయ్యాడు. స్టంప్‌ మైక్‌లో అతడు చేసిన పరుష వ్యాఖ్యలు రికార్డు అయ్యాయి.

పాక్ కెప్టెన్ బలుపు : సౌతాఫ్రికా ఆటగాడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు

Updated On : June 23, 2021 / 4:24 PM IST

మ్యాచ్‌ను గెలిపించేందుకు పోయి పాకిస్తాన్ క్రికెట్‌ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన వన్డేలో జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారానికి కారణమైయ్యాడు. స్టంప్‌ మైక్‌లో అతడు చేసిన పరుష వ్యాఖ్యలు రికార్డు అయ్యాయి.

మ్యాచ్‌ను గెలిపించేందుకు పోయి పాకిస్తాన్ క్రికెట్‌ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన వన్డేలో జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారానికి కారణమైయ్యాడు. స్టంప్‌ మైక్‌లో అతడు చేసిన పరుష వ్యాఖ్యలు రికార్డు అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్సందిస్తున్న నెటిజన్లు ఐసీసీ వెంటనే సర్ఫరాజ్‌ను శిక్షించాలని ఫిర్యాదు చేస్తున్నారు.

ఫెహ్లుక్వాయో జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడుతుండటంతో.. అతణ్ని ఎలా అవుట్ చేయాలో పాలుపోని సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్లెడ్జింగ్‌‌కి పాల్పడ్డాడు. వికెట్ల వెనుకాల నిలబడి ఉర్దూలో.. ‘ఏయ్ నల్లోడా..! ఈ రోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది? నీ గురించి ఏమని ప్రార్థించమని ఆమెను ఈ రోజు కోరావు’ అని సర్ఫరాజ్‌ అన్నాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్లో సర్ఫరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఐసీసీ యాంటీ రేసిజం కోడ్‌లోని ఆర్టికల్ 2.1.1 ప్రకారం దోషిగా తేలితే సర్ఫరాజ్‌ ఖాతాలో 4 నుంచి 8 వరకు సస్పెషన్ పాయింట్లు చేరే అవకాశం ఉంది. రెండు పాయింట్లు ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి సమానం కాగా, ఒక సస్పెన్షన్ పాయింట్ ఒక టీ20 లేదా వన్డే మ్యాచ్‌కి సమానం.

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాక్.. ఫెహ్లుక్వాయో దెబ్బకు 203 పరుగులకే కుప్పకూలింది. 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన ఫెహ్లుక్వాయో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌కు పాక్‌ మాజీ ఆటగాడు రమీజ్‌ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ వ్యాఖ్యలు విన్న మరో వ్యాఖ్యాత అతడేమన్నాడో వివరిస్తారా అని అడగ్గా.. చాలా పెద్ద వ్యాఖ్య కావడంతో ఎలా అనువదించాలో తెలియడం లేదంటూ బుకాయించి తప్పించుకున్నాడు.