SRH vs LSG : ల‌క్నో చేతిలో ఓట‌మిపై స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ క‌మిన్స్ కామెంట్స్‌.. ‘ముందు ముందు మేమేంటో చూపిస్తాం..’

ల‌క్నో చేతిలో స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మిపై ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ స్పందించాడు.

Pat Cummins comments viral after lost match against LSG in ipl 2025

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు తొలి ఓట‌మి ఎదురైంది. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో గెలవాల‌ని భావించిన ఎస్ఆర్‌హెచ్‌కు ల‌క్నో జ‌ట్టు షాకిచ్చింది. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ పై ల‌క్నో జ‌ట్టు 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో చేతిలో ఓట‌మి పై మ్యాచ్ అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ స్పందించాడు.

రాజ‌స్థాన్‌తో ఆడిన పిచ్‌, ల‌క్నోతో ఆడిన పిచ్ ఒక‌టి కాద‌న్నాడు. రెండు వేరు వేరు అని చెప్పుకొచ్చాడు. అయిన‌ప్ప‌టికి మేము ఇంకా వేగంగా ప‌రుగులు చేయాల్సింది అని అభిప్రాయ‌ప‌డ్డాడు. నిజం చెప్పాలంటే ల‌క్నో ప్లేయ‌ర్లు చాలా చ‌క్క‌టి బ్యాటింగ్ చేశార‌ని కొనియాడాడు.

SRH vs LSG : స‌న్‌రైజ‌ర్స్ పై విజ‌యం.. మెట్లు దిగి వ‌చ్చి మ‌రీ పంత్‌ను గ‌ట్టిగా కౌగ‌లించుకున్న సంజీవ్ గొయెంకా..

ఏదీ ఏమైన‌ప్ప‌టికి ఈ వికెట్ కూడా చాలా బాగుంద‌న్నాడు. ఆర్ఆర్ మ్యాచ్‌లో వినియోగించిన పిచ్ ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ పిచ్‌ల‌లో ఒక‌టి అయితే.. ల‌క్నో మ్యాచ్ జ‌రిగిన పిచ్ రెండోది అని చెప్పాడు. బౌల‌ర్ల‌కు కాస్త గ్రిప్ దొరికిన‌ప్ప‌టికి కూడా బ్యాటింగ్‌కు ఎక్కువ‌గా అనుకూలంగా ఉంద‌న్నాడు.

ల‌క్నో జ‌ట్టు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో త‌మ వ్యూహాల‌ను అమ‌లు చేసి బంతులు వేశార‌న్నాడు. అయిన‌ప్ప‌టికి 190 ప‌రుగులు కూడా చాలా మంచి స్కోరు అని క‌మిన్స్ అన్నాడు. ఆర్ఆర్ మ్యాచ్ లో ఇషాన్ కిష‌న్ ఆడిన విధంగా.. ఓ బ్యాట‌ర్ ఇన్నింగ్స్ మొత్తం నిల‌బ‌డాల్సి ఉంద‌న్నాడు. ‘అయితే.. ఈ సారి అలాంటి అవ‌కాశాన్ని ల‌క్నో బౌల‌ర్లు ఇవ్వ‌లేదు. మా జ‌ట్టులో 8 మంది బ్యాట‌ర్లు ఉండ‌డంతో ఎప్పుడైనా స‌రే ఎదురుదాడికి దిగేందుకు సిద్ధంగా ఉండి, మ్యాచ్ పై ప్ర‌భావం చూపించ‌డం కీల‌కం.’ అని క‌మిన్స్ చెప్పాడు.

Ishan Kishan : పాక్ వ‌న్డే కెప్టెన్ రిజ్వాన్ పై ఇషాన్ కిష‌న్ సెటైర్లు.. వీడియో వైర‌ల్‌

తాము ఇంకా మెరుగు అవ్వాల్సిన అంశాలు చాలానే ఉన్నాయ‌న్నాడు. ఈ సీజ‌న్‌లో తాము ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంద‌ని, వాటిల్లో తామెంటో చూపించే అవ‌కాశం ఉంద‌న్నాడు. కాబ‌ట్టి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ ఓట‌మిని మ‌రిచిపోయి ముందుకు సాగాల‌న్నాడు.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. ట్రావిస్ హెడ్ (47; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అనికేత్ వ‌ర్మ (36; 13 బంతుల్లో 5 సిక్స‌ర్లు) నితీశ్ రెడ్డి (32; 28 బంతుల్లో 2 ఫోర్లు) లు రాణించాడంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అవేశ్‌ఖాన్‌, దిగ్వేష్ రతి, ర‌వి బిష్ణోయ్‌, ప్రిన్సీ యాద‌వ్‌లు త‌లా ఓ వికెట్ తీశారు.

Kavya Maran : కావ్యా మార‌న్‌ ఎన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వార‌సురాలో తెలుసా?

అనంత‌రం ల‌క్ష్యాన్ని ల‌క్నో జ‌ట్టు ల‌క్ష్యాన్ని 16.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్ (70; 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), మిచెల్ మార్ష్ (52; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్ట‌గా అబ్దుల్ స‌మ‌ద్ (22 నాటౌట్; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించాడు.