SRH vs LSG : సన్‌రైజర్స్ పై విజయం.. మెట్లు దిగి వచ్చి మరీ పంత్‌ను గట్టిగా కౌగలించుకున్న సంజీవ్ గొయెంకా..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో లక్నో డగౌట్ సంబరాతో నిండిపోయింది.

PIC CREDIT @mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు బోణీ కొట్టింది. గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. ఈ క్రమంలో లక్నో డగౌట్ సంబరాతో నిండిపోయింది. ఇది ఈ సీజన్‌లో లక్నోకి తొలి గెలుపు కావడం ఓ కారణమైతే.. ఐపీఎల్ 2024 సీజన్‌లో హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం మరోకారణం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (47; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అనికేత్ వర్మ (36; 13 బంతుల్లో 5 సిక్సర్లు) నితీశ్ రెడ్డి (32; 28 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్‌ఖాన్, దిగ్వేష్ రతి, రవి బిష్ణోయ్, ప్రిన్సీ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం నికోలస్ పూరన్ (70; 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (52; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టగా అబ్దుల్ సమద్ (22 నాటౌట్; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్ రెండు వికెట్లు తీశాడు. షమీ, ఆడమ్ జంపా, హర్షల్ పటేల్ లు తలా ఓ వికెట్ సాధించారు.
పంత్ ను కౌగలించుకున్న గోయెంకా..
ఈ సీజన్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చేజేతులా ఓడిపోయింది. ఆ సమయంలో లక్నో యజమాని సంజీవ్ గొయెంకా మైదానంలో పంత్‌తో ఏదో విషయమై సీరియస్ చర్చించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తరువాత గోయెంకా ఆటగాళ్ల డ్రెస్సింగ్స్‌లోకి వెళ్లి ప్లేయర్లను ఉత్సాహపరిచిన సంగతి తెలిసిందే.
Sanjiv Goenka gives a tight hug to Rishabh Pant. pic.twitter.com/yHcnCCmxXP
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పై లక్నో విజయం సాధించగానే.. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఆనందంలో మునిగిపోయాడు. అతడు వెంటనే మెట్లు దిగి వచ్చి కెప్టెన్ రిషబ్ పంత్ ను గట్టిగా కౌగలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఏప్రిల్ 1న జరిగే తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తో లక్నో తలపడనుండగా.. మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్‌రైజర్స్ ఆడనుంది.