Ishan Kishan : పాక్ వన్డే కెప్టెన్ రిజ్వాన్ పై ఇషాన్ కిషన్ సెటైర్లు.. వీడియో వైరల్
ఇషాన్ కిషన్, అంపైర్ అనిల్ చౌదరిలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ishan hilarious Rizwan comparison leaves Anil Chaudhary floored
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2025 సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించారు. రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. కాగా.. ఇషాన్ కిషన్, అంపైర్ అనిల్ చౌదరిలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పాకిస్థాన్ ఆటగాడు, వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై ఇషాన్ కిషన్ సెటైర్లు వేశాడు.
ఈ వీడియోలో అనిల్ చౌదరి.. ఇషాన్ కిషన్‌ను ప్రశంసించాడు. ఇప్పుడు ఇషాన్ పరిణతి చెందిన ప్లేయర్‌గా మారాడని చెప్పుకొచ్చాడు. అయితే.. గతంలో వికెట్ కీపింగ్ చేసినప్పుడు అతడు చాలా ఎక్కువగా అప్పీల్ చేసేవాడని అన్నాడు. ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదని, ఈ మార్పు ఎలా సాధ్యమైనందని ప్రశ్నించాడు. దీనిపై ఇషాన్ కిషన్ ఇలా స్పందించాడు.
Vinesh Phogat : ప్రభుత్వ ఉద్యోగమా? రూ.4 కోట్లా? స్థలమా?.. ఏది కావాలి?
View this post on Instagram
అంపైర్లు తెలివైనవారు అయ్యారని తాను అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రతి సారి మనం అప్పీల్ చేస్తే.. ఔటైనప్పుడు కూడా వారు నాటౌట్ ఇస్తుంటారు. అందుకనే.. సరైన సమయంలో మాత్రమే అప్పీల్ చేయాలి. అప్పుడు మాత్రమే అంపైర్లకు మనపై నమ్మకం ఉంటుందని నేను అనుకుంటున్నాను అని ఇషాన్ అన్నాడు.
అలా కాకుండా పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ లాగా చేస్తే.. ఒక్కసారి కూడా అంపైర్లు ఔట్ ఇవ్వరు అని అన్నాడు. అంటే రిజ్వాన్ పదే పదే అప్పీల్ చేస్తాడని ఇషాన్ చెప్పకనే చెప్పాడు.
ఇషాన్ మాట్లాడిన ఈ వీడియోను అంపైర్ అనిల్ చౌదరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.