SRH vs LSG : లక్నోతో సన్‌రైజర్స్ మ్యాచ్.. మరోసారి 10 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదిస్తుందా? లేదా 300 స్కోరా? పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.

Sunrisers Hyderabad vs Lucknow Super Giants head to head players list impact subs
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. వరుసగా రెండో గెలుపును నమోదు చేయాలని సన్‌రైజర్స్ కోరుకుంటుంది. మరో వైపు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఈ సీజన్‌లో గెలుపు బోణీ కొట్టాలని లక్నో ఆరాటపడుతోంది. ఇంకోవైపు అభిమానులు మాత్రం సన్‌రైజర్స్ 300 స్కోరును అందుకోవాలని ఆశిస్తున్నారు.
ఉప్పల్ వేదికగానే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరు దంచికొట్టడంతో 286 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్‌లో అత్యధిక పరగుల రికార్డు (287)కు కేవలం ఒక్క పరుగు దూరంలోనే నిలిచింది.
ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డిలు సూపర్ ఫామ్‌లో ఉండడం సన్‌రైజర్స్ అతి పెద్ద సానుకూలాంశం. పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, సిమర్‌జీత్‌సింగ్, ఆడమ్ జంపాలతో కూడిన బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కొనడం ప్రత్యర్థులకు కష్టమే. మరోవైపు రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోనిలతో కూడిన లక్నో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా కనిపిస్తున్నా ఆ జట్టు బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉంది. మరి విధ్వంసకర వీరులు ఉన్న ఎస్ఆర్‌హెచ్‌ను లక్నో బౌలర్లు ఎంత వరకు నిలవరిస్తారో చూడాల్సిందే.
RR vs KKR : ఐపీఎల్ 2025లో కోల్‌కతా తొలి విజయం.. కెప్టెన్ రహానే ఏమన్నాడో తెలుసా?
హెడ్ టు హెడ్..
ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌లు నాలుగు సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో లక్నో గెలవగా, ఓ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.
చివరిసారిగా ఇరు జట్లు తలపడినప్పుడు సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలవడం గమనార్హం. నాటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. పవర్ ప్లేలోనే 125 పరుగులతో అభిషేక్, హెడ్ జోడీ చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్‌లో అభిషేక్ 75 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు.
పిచ్..
ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 286 పరుగులు స్కోరును సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆర్ఆర్ సైతం 242 పరుగులు చేసింది. దీంతో నేటి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
రెండు జట్ల అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, సిమ్రన్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ
ఇంపాక్ట్ సబ్స్: ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్
Rahul Dravid : మళ్లీ ఆ విషయాన్ని నిరూపించిన రాహుల్ ద్రవిడ్..
లక్నోసూపర్ జెయింట్స్..
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠి, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్
ఇంపాక్ట్ సబ్స్: అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్.