Vinesh Phogat : ప్రభుత్వ ఉద్యోగమా? రూ.4 కోట్లా? స్థలమా?.. ఏది కావాలి?
హర్యానా ప్రభుత్వం వినేష్ ఫోగట్‌కు మూడు ఛాయిస్‌లు ఇచ్చింది.

Haryana Government gives 3 choices to wrestler Vinesh Phogat
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. అయితే.. అధిక బరువు కారణంగా ఫైనల్స్ ఆడకుండా ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో నిరుత్సాహానికి గురైన ఆమె రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టిన వినేష్ 2024 హర్యానా ఎన్నికల్లో జులానా స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది.
కాగా.. ఫైనల్స్‌లో అనర్హత వేటు పడినప్పటికి ఒలింపిక్స్‌లో రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం అందించే సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేష్ ఫోగట్‌కు అందజేస్తామని ఓ సందర్భంలో సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా హర్యానా ప్రభుత్వం.. వినేష్ ఫోగట్‌కు మూడు ఛాయిస్‌లు ఇచ్చింది. ఇందులో ఒకటి రూ.4 కోట్ల నగదు బహుమతి కాగా, రెండోది గ్రూప్ ఏ ఉద్యోగం, ఇక మూడోది హర్యానా షహ్రీ వికాస్ ప్రాధికార్ (HSVP) కింద ప్లాట్ కేటాయింపు. వీటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాలని వినేష్‌కు సూచించింది.
మంగళవారం ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానం ప్రకారం ఫోగట్‌కు ఈ మూడు ఎంపికలను అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.
Lionel Messi : 14 ఏళ్ల తరువాత భారత గడ్డపై మ్యాచ్ ఆడనున్న మెస్సీ.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
‘ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే అయినందున, ఆమె ఏ ప్రయోజనాలను పొందాలనుకుంటున్నారో ప్రభుత్వం ఆమెను అడగాలని నిర్ణయించింది. అని సైని మంగళవారం సాయంత్రం చెప్పారు.
కాగా.. ఈ మూడింటింలో వినేష్ ఫోగట్ ఏ ఛాయిస్‌ను ఎంచుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది.