IPL 2023: పంజాబ్‌తో రాజస్థాన్ కీలక పోరు.. గెలిస్తే సరి.. లేదంటే ఇంటికే.. హెడ్ టు హెడ్ రికార్డు ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్2023లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా కీలక సమరం జరగనుంది. పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచులో విజయం సాధించాల్సిందే. ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టకతప్పదు.

PBKS vs RR
PBKS vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) 2023లో భాగంగా నేడు(శుక్రవారం) ధర్మశాల వేదికగా కీలక సమరం జరగనుంది. పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. రాజస్థాన్, పంజాబ్ జట్లు చెరో 13 మ్యాచులు ఆడగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించాయి. పాయింట్ల పరంగా సమానంగానే ఉన్నప్పటికి మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా రాజస్థాన్ ఆరో స్థానంలో, పంజాబ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచులో విజయం సాధించాల్సిందే. ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టకతప్పదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
రాజస్థాన్‌కే ఎక్కువ అవకాశాలు…
నేటి మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. అయితే.. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం సంజూసేన ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే.. మిగిలిన జట్ల ఫలితాలపై రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు వెలుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ముంబై, బెంగళూరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచుల్లో ఓడిపోతే అప్పుడు రాజస్థాన్, బెంగళూరు, ముంబై పాయింట్లు సమానం అవుతాయి. ఆ సమయంలో నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. మెరుగైన నెట్‌రేట్ కలిగిన జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.
హెడ్ టూ హెడ్ రికార్డు :
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు జట్లు 25 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. 14 మ్యాచుల్లో రాజస్థాన్ విజయం సాధించగా. 11 మ్యాచుల్లో పంజాబ్ గెలుపొందింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఓ సారి తలపడ్డాయి. ఆ మ్యాచులో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తుది జట్ల అంచనా :
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్) , అథర్వ తైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కరన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్