ఇచ్చి పడేసిన బీసీసీఐ.. బూమ్రా, రోహిత్ శర్మకు ఇన్‌డైరెక్ట్‌గా స్ట్రాంగ్ వార్నింగ్..

ఆసియా కప్‌లో ఆడేందుకు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు, సిరాజ్ ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టులు ఆడాడు. అతని విషయంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌కి అవకాశం ఉంది.

ఇచ్చి పడేసిన బీసీసీఐ.. బూమ్రా, రోహిత్ శర్మకు ఇన్‌డైరెక్ట్‌గా స్ట్రాంగ్ వార్నింగ్..

Updated On : August 5, 2025 / 7:00 PM IST

భారత క్రికెటర్లు వారికి నచ్చిన మ్యాచ్‌లను మాత్రమే ఆడతామంటే తాము ఒప్పుకోబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. కొంతమంది క్రికెటర్లు తాము ఇష్టపడే మ్యాచుల్లోనే ఆడుతున్నారు. ముఖ్యంగా వన్డేలు, దేశవాళీ సిరీస్‌ల వంటి తక్కువ ఆదరణ ఉన్న మ్యాచ్‌లు ఆడకుండా తప్పించుకుంటూ ఐపీఎల్‌, వరల్డ్ కప్‌లాంటి టోర్నీల్లో మాత్రమే ఆడడానికి ఆసక్తి చూపుతున్నారు.

బీసీసీఐ ఈ వ్యవహారంపై హెచ్చరిక జారీ చేసింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అన్నీ ఆడే క్రికెటర్లు అన్ని ఫార్మాట్లకూ సిద్ధంగా ఉండాలని, అంతేగానీ, వారికి నచ్చిన మ్యాచుల్లోనే ఆడే అవకాశం ఇకపై ఉండదని తెలిపింది.

బోర్డు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. అన్ని ఫార్మాట్లలో ఆడే, కేంద్ర ఒప్పందం పొందిన ఆటగాళ్లకు త్వరలోనే ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా మెసేజ్ పంపనుంది. ఇక నుంచి ఇష్టం వచ్చిన మ్యాచులే ఆడే తీరును అంగీకరించబోమని స్పష్టంగా తెలియజేయనుంది.

“ఈ మేరకు చర్చలు జరిగాయి. కేంద్ర ఒప్పందం ఉన్న ఆటగాళ్లకు, ముఖ్యంగా అన్ని ఫార్మాట్లకు స్థిరంగా ఆడే వారికి ఈ మెసేజ్ ఇవ్వనున్నారు” అని బీసీసీఐకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.

బౌలర్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై మాత్రం కూల్‌గా..
ఆటగాళ్లు అన్ని మ్యాచులకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ చెబుతున్నప్పటికీ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా విస్మరించబోమని కూడా అంటోంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ అంటే ఆటగాళ్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు గాయపడకుండా ఉండేందుకు కొన్ని మ్యాచుల్లో ఆడకుండా వారికి విశ్రాంతి ఇవ్వడం.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని బీసీసీఐ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల వర్క్‌లోడ్‌ విషయంలో జాగ్రత్త అవసరమని చెప్పింది. అయితే, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరిట కీలక మ్యాచ్‌లు మిస్ కావడాన్ని మాత్రం అంగీకరించబోమని బీసీసీఐకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.

ఆసియా కప్‌లో ఆడేందుకు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు, సిరాజ్ ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టులు ఆడాడు. అతని విషయంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌కి అవకాశం ఉంది. అయితే ఆసియా కప్‌కు అతడు తిరిగి వస్తాడా? లేదా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక రోహిత్ శర్మ టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ, వన్డేల్లో, ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.