బుమ్రా ఎక్కడ? హార్ధిక్ పాండ్యా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కేవిన్ పీటర్సన్, సునీల్ గవాస్కర్

హార్దిక్ పాండ్యా నిర్ణయాన్నిఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు.

బుమ్రా ఎక్కడ? హార్ధిక్ పాండ్యా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కేవిన్ పీటర్సన్, సునీల్ గవాస్కర్

Hardik Pandya

IPL 2024 Hardik Pandya : ఐపీఎల్ 2024 టోర్నీలో ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై జట్టులో కీలక బౌలర్ జస్ర్పీత్ బుమ్రా. మొదటి ఓవర్ బుమ్రానే వేస్తాడని అందరూ భావించారు. బుమ్రా స్థానంలో హార్ధిక్ మొదటి ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు. ప్రపంచ స్థాయి బౌలర్లలో మొదటి రెండు స్థానాల్లో ఉండే బుమ్రాను కాదని హార్దిక్ తొలి ఓవర్ వేయయానికి సిద్ధమవ్వడంపై అందరూ స్టేడియంలోని ప్రేక్షకులతోపాటు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.

Also Read : IPL 2024 : ముంబై ఇండియన్స్ ఓటమి తరువాత హార్దిక్ పై రోహిత్ ఆగ్రహం.. ఆకాశ్ అంబానీ ఏం చేశారంటే?

కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాన్ని కామెంట్రీ బాక్స్ లో ఉన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఉండగా హార్దిక్ తొలి ఓవర్ వేయాలన్న నిర్ణయం సరికాదని వారు తమ అభిప్రాయాన్ని తెలిపారు. కామెంట్రీ బాక్స్ లోఉన్న పీటర్సన్ జస్ర్పీత్ బుమ్రా ఎందుకు బౌలింగ్ ప్రారంభించడం లేదు? నాకు ఇది అర్థం కాలేదు అంటూ వ్యాఖ్యానించాడు.. ‘చాలా మంచి ప్రశ్న.. చాలాచాలా మంచి ప్రశ్న’ అంటూ గవాస్కర్ బదులిచ్చారు. అదే సమయంలో మాజీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఎక్స్ ఖాతాలో బుమ్రా ఎక్కడ? అంటూ ప్రశ్నించాడు.

Also Read : IPL 2024 : రోహిత్ శర్మ నామస్మరణతో హోరెత్తిన స్టేడియం.. హార్థిక పాండ్యా ఏం చేశాడంటే? వీడియోలు వైరల్

గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ఓపెనర్లుగా కెప్టెన్ శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహాలు వచ్చారు. బుమ్రాను కాదని తొలి ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా వికెట్ తీయకపోగా.. 11 పరుగులు ఇచ్చాడు. ఆ తరువాత సోషల్ మీడియాలో హార్దిక్ తొలి ఓవర్ వేయాలన్న నిర్ణయంపై నెటిన్లు సెటైర్లతో కూడిన కామెంట్లు చేశారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 169 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ఆరు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది.