IPL 2024 : ముంబై ఇండియన్స్ ఓటమి తరువాత హార్దిక్ పై రోహిత్ ఆగ్రహం.. ఆకాశ్ అంబానీ ఏం చేశారంటే?

రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 29 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 43 పరుగులు చేశాడు

IPL 2024 : ముంబై ఇండియన్స్ ఓటమి తరువాత హార్దిక్ పై రోహిత్ ఆగ్రహం.. ఆకాశ్ అంబానీ ఏం చేశారంటే?

Hardik Pandya vs Rohit Sharma

Updated On : March 25, 2024 / 8:35 AM IST

Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో అందరి దృష్టి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపైనే నిలిచింది. మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో రోహిత్ శర్మ, హార్దిక్ మధ్య కొన్నిసార్లు సరదా సన్నివేశాలు చోటుచేసుకోగా.. మరికొన్ని సార్లు వీరిద్దరి మధ్య విబేధాలు పొడచూపాయి.

Also Read : IPL 2024 : రోహిత్ శర్మ నామస్మరణతో హోరెత్తిన స్టేడియం.. హార్థిక పాండ్యా ఏం చేశాడంటే? వీడియోలు వైరల్

రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 29 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 43 పరుగులు చేశాడు. రోహిత్ మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవటంతో ముంబై జట్టు ఓటమి పాలైంది. మ్యాచ్ ముగిసిన తరువాత హార్దిక్ పాండ్యా రోహిత్ వద్దకు వెళ్లి అతన్ని కౌగిలించుకున్నాడు. రోహిత్ అసహనంతో హార్దిక్ పై కోపగించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ ఓటమిపై రోహిత్ హార్దిక్ పాండ్యాతో సీరియస్ గా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. హార్దిక్ పాండ్యా రోహిత్ చెప్పే మాటలను వింటూ తలూపుతూ నిలుచుండిపోయాడు. రోహిత్, హార్దిక్ పక్కనే రషీద్ తో ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ మాట్లాడుతున్నాడు.. రోహిత్ హార్దిక్ ను మందలిస్తుంటే వారు పక్కకు వెళ్లిపోయారు.

Also Read : IPL 2024 : గుజరాత్ బోణీ.. ఉత్కంఠ పోరులో ముంబైపై 6 పరుగుల తేడాతో విజయం