Prime Volleyball League 2024 : హైదరాబాద్ పై బెంగళూర్ విజయం.. టార్పెడోస్‌ సూపర్ 5 ఆశలు సజీవం

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024లో బెంగళూర్‌ టార్పెడోస్ సూప‌ర్ 5 ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

Prime Volleyball League 2024 Black Hawks get blown away by Torpedoes

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024లో బెంగళూర్‌ టార్పెడోస్ సూప‌ర్ 5 ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. హైద‌రాబాద్ బ్లాక్‌హాక్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో 15-6, 15-11, 15-12 తేడాతో హైద‌రాబాద్‌ను బెంగ‌ళూరు వ‌రుస సెట్ల‌లో ఓడించింది. మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసిన సేతు టిఆర్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఓట‌మితో హైద‌రాబాద్ సూప‌ర్ 5 రేసు నుంచి నిష్ర్క‌మించింది. గ్రూప్‌ దశలో ఏడు మ్యాచులు ఆడ‌గా హైద‌రాబాద్‌కు ఇది ఆరో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

మ్యాచ్ ఆరంభం నుంచే సేతు రెచ్చిపోయాడు. బలమైన సర్వ్‌లతో హైదరాబాద్‌ డిఫెన్స్‌ను చెదరగొట్టాడు. హైద‌రాబాద్‌ ఆటగాడు సాహిల్‌ కుమార్‌ సూపర్‌ స్పైక్‌లతో ఎదురుదాడి చేయడానికి య‌త్నించ‌గా టార్పెడోస్‌ శ్రాజన్‌ శెట్టి నెట్‌ దగ్గర కళ్లుచెదిరే బ్లాక్‌లతో ఆకట్టుకున్నాడు. థామస్‌ వరుస స్పైక్‌లతో టార్పెడోస్‌ మ్యాచ్‌లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు దోహదం చేశాడు.

Virender Sehwag : సెహ్వాగ్ కాదా? సునీల్ గ‌వాస్క‌ర్ త‌రువాత అత్యుత్త‌మ ఓపెన‌ర్ ఎవ‌రంటే?

కోర్టులో బెంగలూర్‌ టార్పెడోస్‌ ఆటగాళ్లు ఒకరికొకరు మంచి సమన్వయంతో మెరువగా.. మరోవైపు హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ శిబిరంలో అది పూర్తిగా లోపించింది. సాహిల్‌ ఎటాకింగ్‌తో మెప్పించినా… బెంగళూర్‌ను సేతు సూపర్‌ సర్వ్‌లతో ముందుకు నడిపించాడు. సేతు సూపర్‌ సర్వ్‌లకు శ్రాజన్‌, ముజీవ్‌ బ్లాక్‌లతో మ్యాచ్‌పై బెంగళూర్‌ పట్టు సాధించింది.

రెండు సెట్లలో నిరాశపరిచిన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్.. మూడో సెట్‌ ఆరంభంలో పుంజుకున్నట్టే కనిపించింది. ప్రిన్స్‌ తెలివైన బ్లాకింగ్‌కు బెంగళూర్‌ సర్వీస్‌ తప్పిదాలు తోడవటంతో హైదరాబాద్‌ పాయింట్లు సాధించింది. కానీ సేతు సూపర్‌ సర్వ్‌లతో విజృంభించటంతో అతడికి ఎదురే లేదు. సేతు 10 పాయింట్లు సాధించగా, థామస్‌ ఆరు, శెట్టి ఆరు, పంకజ్‌ ఐదు పాయింట్లు సాధించారు.

Rohit Sharma : ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ధ‌ర్మ‌శాల‌కు చేరుకున్న భార‌త కెప్టెన్‌

ట్రెండింగ్ వార్తలు