Pro Kabaddi : ఉత్కంఠభరిత పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి

శనివారం తెలుగు టైటాన్స్, పుణేరి పల్టాన్ మధ్య నువ్వే..నేనా అన్నట్లు జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ తెలుగు టైటాన్స్‌పై ఒక పాయింట్ తేడాతో విజయం సాధించింది.

Pro Kabaddi : ఉత్కంఠభరిత పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి

Pro Kabaddi

Updated On : December 26, 2021 / 7:23 AM IST

Pro Kabaddi : ప్రో కబడ్డీ ఎనిమిదవ సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. శనివారం తెలుగు టైటాన్స్, పుణేరి పల్టాన్ మధ్య నువ్వే..నేనా అన్నట్లు జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ తెలుగు టైటాన్స్‌పై ఒక పాయింట్ తేడాతో విజయం సాధించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన తెలుగు టైటాన్స్ తోలి అర్ధభాగానికి 20-14 పాయింట్లతో ముందంజలో ఉంది. అందరు టైటాన్స్ విజయం కాయమనుకున్నారు. కానీ రెండో అర్ధభాగంలో పుణేరి పల్టాన్ ప్లేయర్స్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో ఆ జట్టు ఒక పాయింట్ తేడాతో విజయం సాధించింది.

చదవండి : Pro Kabaddi 2021 : తమిళ్ తలైవాస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న తెలుగు టైటాన్స్

అయితే మాచ్య్ 33-34 పాయింట్లు ఉన్న సందర్భంలో తెలుగు టైటాన్ నుంచి రైడ్‌కు వెళ్లిన రాకేష్‌ బోనస్‌ పాయింట్‌ సాధించాననే నమ్మకంతో తిరిగొచ్చాడు. కానీ రిఫరీ పాయింట్‌ ఇవ్వలేదు. సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. దీంతో టైటాన్స్‌ 33-34తో ఓటమి పాలైంది. సిద్ధార్థ్‌ దేశాయ్‌ (15) పోరాటం వృథా అయింది. పల్టాన్‌ తరపున మోహిత్‌ (9) అస్లామ్‌ (8), అభినేష్‌ (5) రాణించారు. తోలి అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ 20 పాయింట్స్ సాధించగా.. రెండవ అర్ధభాగంలో 13 పాయింట్స్ మాత్రమే సాధించింది. ఇక పుణేరి మొదటి అర్ధభాగంలో 14 పాయింట్స్ సాధించగా.. రెండవ అర్ధభాగంలో 20 పాయింట్లు సాధించింది.

చదవండి : Cricket 2021: ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో టాప్-5 బ్యాట్స్‌మెన్లు వీరే!