ఇండియాలో ఫస్ట్ : ప్రొ వాలీ బాల్ లీగ్ నేటి నుంచే

ఇండియాలో ఫస్ట్ : ప్రొ వాలీ బాల్ లీగ్ నేటి నుంచే

Updated On : June 21, 2021 / 3:50 PM IST

ప్రొ కబడ్డీ, ప్రొ బాక్సింగ్ లాగే ప్రొ వాలీబాల్ లీగ్ కూడా కొత్త అవతారమెత్తింది. ప్రతి క్షణం ఆసక్తికరంగా సాగే పోటీ, కళ్లు చెదిరే స్మాష్‌లతో ఔరా అనిపించే వాలీబాల్ లీగ్‌కు సమయం ఆసన్నమైంది. నెట్ పైకి ఎగిరి కొట్టే స్టాష్ షాట్‌లు, కళ్ల చెదిరే బ్లాకింగ్స్, అనూహ్యంగా మారిపోయే మ్యాచ్  ఆధిక్యాలు వీటన్నిటితో కనువిందు చేసేందుకు ప్రొ వాలీబాల్ లీగ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 2 శనివారంన మనదేశంలో తొలిసారిగా మొదలవుతుండటంతో భారత క్రీడా ఔత్సాహికులంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఆరు ఫ్రాంచైజీలతో 18 మ్యాచ్‌లుగా జరిగే ఈ లీగ్‌లో తొలి అంచె పోటీలు కొచ్చిలో జరగనున్నాయి. సెమీస్‌, ఫైనల్‌తో పాటు ఆరు మ్యాచ్‌లకు మాత్రం చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌, కాలికాట్‌ హీరోస్‌, చెన్నై స్పార్టాన్స్‌, బ్లాక్‌హాక్స్‌ హైదరాబాద్‌, కొచ్చి బ్లూ స్పైకర్స్‌, యు ముంబా వాలీ జట్లు ఈ లీగ్‌లో పోటీపడబోతున్నాయి.

తొలి మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌ జట్టు యు ముంబా వాలీతో తలపడనుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగే టోర్నీలో అన్ని మ్యాచ్‌ల్లో ఐదు సెట్ల పాటు పోరు జరుగుతుంది. ఏ జట్టు మొదట 15 పాయింట్లు సాధిస్తుందో ఆ జట్టుకు ఆ సెట్‌ సొంతం అవుతుంది.

విజయానికి 2 పాయింట్లు లభిస్తాయి. ఐదు సెట్లూ గెలిస్తే వైట్‌వాష్‌గా పేర్కొంటారు. ఇలా చేస్తే అదనంగా మూడు పాయిట్లు లభిస్తాయి. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లను 25 పాయింట్ల విధానంలో నిర్వహిస్తారు. ప్రొ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌)కు రూపే స్పాన్సర్‌షిప్‌ చేస్తోంది.