PUBGలో కొత్త మోడ్: ఫిబ్రవరి 19న అందుబాటులోకి..

యువతకు పిచ్చెక్కిస్తున్న ఆండ్రాయిడ్ గేమ్‌లలో PUBG గేమే టాప్.  మార్కెట్‌లోకి వచ్చిన కొంతకాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్..  అంటూ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ గేమ్‌లలోని దశలు బీభత్సమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. మళ్లీ ఇప్పుడు కొత్త అప్‌డేట్ 0.11.0 ఫిబ్రవరి 19 నుంచి మార్కెట్ లోకి రానుంది. 

ఫిబ్రవరి 18న పబ్జీ సర్వర్లన్నీ మెయింటెనెన్స్ చేస్తుండటంతో కొత్తగా రానున్న జోంబీ మోడ్ ఫిబ్రవరి 19వరకూ అందుబాటులోకి రావొచ్చన్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంపై టెన్సెంట్ గేమ్స్ ఎటువంటి నిర్దారణ ఇవ్వకపోవడంతో ఆఖరి తేదీలో ఎలాంటిమార్పులైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఈ జోంబీ మోడ్‌తో పాటు బీసీ టు యూసీ కరెన్సీ కన్వర్షన్ ఫీచర్‌తో పాటు మొబైల్ ప్రైమ్, ప్రైమ్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్లు ఈ అప్‌డేట్‌ను ఆపేసే సూచనలు లేకపోలేదు. అయితే దాంతో పాటు PUBGలో G63Cగన్ కూడా అందుబాటులోకి రానుందని చెప్పుకొచ్చినా.. రాబోయే అప్‌డేట్‌లో వస్తున్న సూచనలేమీ కనిపించడం లేదు. 

అయితే.. రాబోయే అప్‌డేట్‌లో హైలెట్స్ ఇలా ఉన్నాయి:

1. Sanhok మ్యాప్‌లో Tukshai 
2. Erangel మ్యాప్‌లో మంచు వాతావరణం
3. Miramar, Erangel మ్యాప్‌లలో కొత్త వాతావరణం.
4. గేమ్‌లో ఎలా చచ్చిపోయామో రిప్లే చేసి చూపించడానికి న్యూ డెత్ కెమెరా
5. జోంబీ మోడ్
6. ఎమ్కే 47 మ్యూటెంట్ రైఫిల్
7. వెపన్లలో లేజర్ సైట్
8. Vikendi ఏరియాలో Snow bike 
9. గేమ్ వెనుక వచ్చే గొంతులలో క్లాజిక్‌నెస్

10. బీటా వర్షన్లలో PUBG Vikendi snow map తీసేస్తున్నారు. 

Read Also : వాట్సాప్ వెబ్ తరహాలో: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

Read Also : వాట్సాప్ గుడ్ ఆప్షన్: ఇకపై మీ పర్మిషన్ మస్ట్