IPL 2023, CSK vs PBKS: చెపాక్‌లో పంజాబ్‌దే విజ‌యం.. ఉత్కంఠ పోరులో చెన్నైపై ఆఖ‌రి బంతికి గెలుపు

IPL 2023, CSK vs PBKS:చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2023, CSK vs PBKS: చెపాక్‌లో పంజాబ్‌దే విజ‌యం.. ఉత్కంఠ పోరులో చెన్నైపై ఆఖ‌రి బంతికి గెలుపు

Punjab Kings won

Updated On : April 30, 2023 / 8:14 PM IST

IPL 2023, CSK vs PBKS: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్(Punjab Kings) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖ‌రి బంతికి 3 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా సికింద‌ర్ ర‌జా మూడు ప‌రుగులు తీయ‌డంతో విజ‌యం పంజాబ్ సొంత‌మైంది.

పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభసిమ్రాన్ సింగ్(42; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స‌ర్లు), లివింగ్ స్టోన్‌(40; 24 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్స‌ర్లు) రాణించ‌గా ఆఖ‌ర్లో జితేశ్ శ‌ర్మ‌(21; 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), సికింద‌ర్ ర‌జా(13 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్‌) ధాటిగా ఆడ‌డంతో ఆఖ‌రి బంతికి గెలిచింది. చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయ‌గా ర‌వీంద్ర జ‌డేజా రెండు వికెట్లు, ప‌తిర‌ణా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

IPL 2023, CSK vs PBKS: ఉత్కంఠ పోరులో చెన్నై పై పంజాబ్ విజ‌యం..Live Updates

అంత‌కముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ డేవాన్ కాన్వే(92నాటౌట్; 52 బంతుల్లో 16 ఫోర్లు, 1సిక్స్‌) దంచికొట్ట‌గా.. రుతురాజ్ గైక్వాడ్(37; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), శివ‌మ్ దూబే(28; 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించారు.

ర‌వీంద్ర జ‌డేజా(12), మోయిన్ అలీ(10) విఫ‌ల‌మైన ఆఖ‌రి ఓవ‌ర్‌లో ధోని (13 నాటౌట్; 4 బంతుల్లో 2సిక్స‌ర్లు) రెండు సిక్స‌ర్లు కొట్ట‌డంతో చెన్నై స్కోరు 200 చేరింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, సామ్ క‌ర‌న్‌, రాహుల్ చ‌హ‌ర్‌, సికింద‌ర్ ర‌జాలు తలా ఓ వికెట్ తీశారు.

Rohit Sharma: రోహిత్ రెస్ట్ తీసుకో అన్న గ‌వాస్క‌ర్.. అన్ని మ్యాచ్‌లు ఆడ‌తాడ‌న్న ముంబై కోచ్ బౌచ‌ర్‌..!