Tirumala : వైజాగ్‌లో త్వరలోనే అకాడమీ – పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తిరుమలకు చేరుకున్నారు. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం పీవీ సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అర్చకులు అమెకు అందచేశారు.

Pv Sindhu
PV Sindhu : ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తిరుమలకు చేరుకున్నారు. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం పీవీ సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అర్చకులు అమెకు అందచేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం తాను ఇక్కడకు రావడం జరుగుతోందన్నారు.
Read More : Weight Loss : బరువు తగ్గేందుకు చపాతీలు రోజుకు ఎన్నితినాలో తెలుసా?..
స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వైజాగ్ లో త్వరలోనే బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభిస్తామని, యువతను క్రీడల్లో ఉత్సాహపరచాలన్నారు. ఇక కరోనా వైరస్ ఆమె స్పందించారు. ప్రజలందరూ ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు పీవీ సింధు.
హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి మెడల్ గెలుచి యావత్ దేశాన్ని గర్వపడేలా చేశారు. చైనాకు చెందిన హె బింగ్ జావో (21-13, 21-15)పై విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకున్నారు. టోక్యోకు వెళ్లకముందే పతకం తీసుకొస్తుందని ఆశించిన కలలను నిజం చేశారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజతాన్ని అందుకున్న సింధు.. అనంతరం ఆటలో మరింత వేగం చూపించారు.
Read More : Acharya: మెగా మేనియా.. రికార్డ్ ధరకు డబ్బింగ్ రైట్స్!
మిక్స్‌డ్ టీమ్స్‌తో గోల్డ్, 2018 కామెన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ సాధించారు. 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఒలింపిక్ లో కాంస్య పతకం సాధించినందుకు పలువురు అభినందనలు తెలియచేశారు. ఏపీ ప్రభుత్వం రూ. 30 లక్షలు, బీసీసీఐ రూ. 25 లక్షలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రూ. 25 లక్షల క్యాష్ రివార్డులు ప్రకటించాయి.