PV Sindhu : పూల చీరలో మెరిసిపోతున్న సింధు
ఓ చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్, మరో చేతిలో కాక్ పట్టుకొని స్మాష్ షాట్లతో కనిపించే పీవీ సింధు.. చీరకట్టులో మెరిశారు. పండుగ సమయాల్లో సింధు ఎక్కువగా సాంప్రదాయ దుస్తులనే ధరిస్తారు.
PV Sindhu : ఓ చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్, మరో చేతిలో కాక్ పట్టుకొని స్మాష్ షాట్లతో కనిపించే పీవీ సింధు.. చీరకట్టులో మెరిశారు. పండుగ సమయాల్లో సింధు ఎక్కువగా సాంప్రదాయ దుస్తులనే ధరిస్తారు. తాజాగా ఆమె తెలుపు చీర కట్టుకొని తళతళ మెరిశారు. మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఏడు లక్షలమంది లైక్ చేయగా.. వేళల్లో కామెంట్స్ చేశారు. ఇక తమ అభిమాన క్రీడాకారిణిని చీరకట్టులో చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.
కాగా ఈ చీరను ప్రముఖ డిసైనర్ మనీష్ మల్హోత్రా డిసైన్ చేశారు. పింక్, బ్లూ, పర్పుల్ త్రెడ్వర్క్ ఉన్న ఆ చీరలో చాలా సహజమైన అందంతో సింధు ఫోటోలకు ఫోజు ఇచ్చారు. కోర్టులో స్మాష్ షాట్లతో కనిపించే సింధు ఒక్కసారిగా చీరలో కలర్ఫుల్గా కనిపించడంతో ఆమె అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
పెద్దగా మేకప్ లేకుండా న్యాచురల్ గా ఉన్నారు. ఆమె అందానికి చెవి పోగులు మరో అట్రాక్షన్ గా మారాయి. కాగా తాజాగా జరిగిన ఒలింపిక్స్ లో సింధు కాంస్యపతకం గెలిచిన విషయం విదితమే.. ఇక ఇప్పుడు కొంచం ఖాళీ సమయంలో దొరకడంతో దైవదర్శనాలు వెళ్తున్నారు. కొద్దీ రోజుల క్రితం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
pic: cridit :- pvsindhu1