ENG vs IND: వాళ్లకో న్యాయం.. మాకో న్యాయమా? అంటూ అంపైర్‌పై మండిపడ్డ రవిచంద్రన్ అశ్విన్.. అతడి ఆవేదనలో అర్థం ఉంది..
లార్డ్స్ టెస్ట్‌లో సిరాజ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో..

అంపైర్ పాల్ రైఫెల్ తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. లార్డ్స్ టెస్ట్‌లో సిరాజ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లెగ్ బిఫోర్ అపీల్‌లో రైఫెల్ ఔట్‌గా ప్రకటించకపోవడంపై వివాదం రాజుకుంది.
రైఫెల్ ఔట్‌గా ప్రకటించకపోవడంపై భారత్ రివ్యూకు వెళ్లింది. రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను తాకుతున్నట్లు కనిపించింది. అయినా, ‘అంపైర్ కాల్’ కారణంగా రూట్ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అంపైర్ రైఫెల్‌ను సిరాజ్ ఆగ్రహంగా చూశాడు.
బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ విషయంలో క్యాచ్ ఔట్ ఇచ్చాడు అదే అంపైర్ రైఫెల్. అయితే, రీప్లేలో బంతి బ్యాట్‌ను ఎక్కడా తాకలేదని స్పష్టమైంది.
అంపైర్ రైఫెల్ తీరుపై అశ్విన్ స్పందిస్తూ.. “పాల్ రైఫెల్‌తో నాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నాను. భారత్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇటువంటి సందర్భాలు వస్తే ఆయనకు ఎప్పుడూ నాటౌట్‌గానూ అనిపిస్తుంది. భారత్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఔట్ అనిపిస్తుంది” అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
“ఆయన ఇటువంటి తీరును భారత్‌పై మాత్రమే కాకుండా అన్ని జట్లపైనా ప్రదర్శిస్తుంటే ఐసీసీ ఈ అంశాన్ని పరిశీలించాలి” అని అశ్విన్ అన్నాడు.
ఇక, శుభ్‌మన్ గిల్ ఔట్ అయిన తీర్పుపై అశ్విన్ మాట్లాడుతూ.. బ్యాట్, బంతికి మధ్య చాలా గ్యాప్ ఉందని, అలాంటప్పుడు రైఫెల్ ఎలా ఔట్ ఇచ్చారో అర్థం కావడం లేదన్నాడు.
రైఫెల్‌పై అశ్విన్ మాత్రమే కాదు.. సునీల్ గవాస్కర్, జొనాథన్ ట్రాట్, అనిల్ కుంబ్లే లాంటి వారు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జో రూట్ ఔట్ అని రైఫెల్ ప్రకటించకపోవడాన్ని విమర్శించారు.
లార్డ్స్ టెస్ట్ భారత్-ఇంగ్లండ్ మధ్య సమానంగా ఉంది. ఇరుజట్లు 2-1 ఆధిక్యంలోకి వెళ్లే అవకాశాల్లో ఉన్నాయి. ఫైనల్ డే మొదలవగానే రిషభ్ పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.