Team India Coach : టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్?

బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా ఆయన్ను ఒప్పించినట్లు సమాచారం.

Rahul Dravid : భారత జట్టు హెడ్ కోచ్ గా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ ఉండనున్నారా ? అంటే ఎస్ అనే సమాధానం వస్తోంది. ఆయన బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ పదవిని చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా…బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా ఆయన్ను ఒప్పించినట్లు సమాచారం. టీమిండియా జట్టుకు తదుపరి హెడ్ కోచ్ గా ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించడం జరిగిందని, తొందరలోనే…ఎస్ సీఏ పదవికి ఆయన రాజీనామా చేయడం జరుగుతుందని బీసీసీ అధికారి వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ పత్రిక వెల్లడించింది.

Read More : Festive Sales : ఈ కామర్స్ కంపెనీలకు పండుగే పండుగ…వేల కోట్లలో అమ్మకాలు

ప్రస్తుతం టీమిండియాలో యువ రక్తం ప్రవహిస్తోందని, ఈ క్రమంలో..ఎన్ సీఏ హెడ్ గా వాళ్లతో ద్రవిడ్ మమేకమైతే..మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే జై షా, గంగూలీలు రంగంలోకి దిగారని..ద్రవిడ్ కు నచ్చచెప్పడంతో..ఒప్పుకున్నారని వెల్లడించారు. బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్ కొనసాగుతారని బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : VK Sasikala : అమ్మ సమాధి వద్దకు చిన్నమ్మ.. రీఎంట్రీపై కీలక ప్రకటన చేస్తారా?

మరోవైపు..అక్టోబర్ 17 నుంచి టీ 20 వరల్డ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ముగిసిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపడుతున్న రవిశాస్త్రి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవి అనీల్ కుంబ్లేతో పాటు ఇతర విదేశీ మాజీ ఆటగాళ్లు చేపడుతారని తొలుత ప్రచారం జరిగింది. చివరకు రాహుల్ ద్రవిడ్ అయితే..బాగుంటుందని బీసీసీఐ భావించినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు