VK Sasikala : అమ్మ సమాధి వద్దకు చిన్నమ్మ.. రీఎంట్రీపై కీలక ప్రకటన చేస్తారా?

దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ (చిన్నమ్మ) మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. జయలలిత సమాధి దగ్గర ఆమె నివాళులర్పించేందుకు వచ్చారు.

VK Sasikala : అమ్మ సమాధి వద్దకు చిన్నమ్మ.. రీఎంట్రీపై కీలక ప్రకటన చేస్తారా?

Vk Sasikala, Who Quit Public Life, Returns To Jayalalithaa Memorial

Jayalalithaa Memorial : దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ (చిన్నమ్మ) మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. జయలలిత సమాధి దగ్గర ఆమె నివాళులర్పించేందుకు వచ్చారు. మాజీ ముఖ్యమంత్రులైన జయలలిత, ఎంజీ రామచంద్రన్, సీఎన్ అన్నాదురైలకు నివాళులు అర్పించారు శశికళ. అయితే ఇక్కడే ఆమె తన పొలిటికల్ రీఎంట్రీపై కీలక ప్రకటన చేస్తారానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత మార్చిలో క్రియాశీల రాజకీయాలకు స్వస్తిపలికిన చిన్నమ్మ.. ఇప్పుడు మనస్సు మార్చుకుని మళ్లీ ప్రజా జీవితంలోకి అడుగుపెడతారా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్‌ 17నాటికి అన్నాడీఎంకే పార్టీ (AIADMK) స్థాపించి 50ఏళ్లు పూర్తి కానుంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో చిన్నమ్మ శశకళ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
VK SasiKala : శశికళకు షాకిచ్చిన ఐటీ శాఖ…రూ. 100 కోట్ల ఆస్తులు జప్తు

జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు శశికళ దూరంగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనమైంది. దాంతో చిన్నమ్మ మళ్లీ తన వ్యూహాలకు పదునుపెట్టారు. కేడర్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. తన ఎంట్రీకి సంబంధించి ముందుగానే ‘నమదు ఎంజీఆర్‌’ పత్రిక ద్వారా ప్రకటనలు వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో కూడా నేనొస్తున్నా అనే సంకేతాన్ని కూడా కేడర్‌లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదని, అందరూ సమానమే చిన్నమ్మ వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారంతా తల్లితో సమానమని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ ఏడాది ప్రారంభంలో జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత శశికళ స్మారక చిహ్నాలను సందర్శించడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలలో అన్నాడీఎంకే ఓడిపోవడంతో మళ్లీ తాను రాజకీయాల్లో రావాల్సిన సమయం ఆసన్నమైందనే సంకేతాలు ఇస్తున్నారు. రామవరం గార్డెన్‌లోని MGR హౌస్ వద్ద ఒక ప్రత్యేక పాఠశాలతో సహా మరికొన్ని ప్రదేశాలను శశికళ సందర్శించనున్నారు.

శశికళ రీఎంట్రీ ప్రయత్నాలపై స్పందించిన అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్.. అన్నాడీఎంకేలో ఆమెకు చోటు కల్పించేది లేదని స్పష్టం చేశారు. 2016 డిసెంబర్ నెలలో జయలలిత మరణించిన తరువాత శశికళ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న శశికళ నాలుగు ఏళ్లు జైలుశిక్ష విధించినప్పటికీ ఆమె ముఖ్యమంత్రి అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. శశికళ జైలుకు వెళ్లే ముందు ఎడప్పాడి కె. పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత నుంచి శశికళ  ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.
Sasikala: దినకరన్‌ను పక్కకుపెట్టిన శశికళ