IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ పై ఫిక్సింగ్ ఆరోపణలు!
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఏప్రిల్ 19న జరిగిన జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ మ్యాచ్ ఫిక్సైంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. రాజస్థాన్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) తాత్కాలిక కన్నీనర్ జైదీప్ బిహాని.
విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌లో ఆర్ఆర్ ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్‌సీఏకు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు.
LSG VS DC : లక్నోతో మ్యాచ్.. భారీ రికార్డులపై కన్నేసిన కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్..
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ఐదోసారి పొడిగించారు. ఆర్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే అన్ని మ్యాచ్‌లు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. అయితే.. ఐపీఎల్‌కు వచ్చే సరికి జిల్లా పరిషత్ బాధ్యతలు తీసుకుంటుంది. ఐపీఎల్ నిర్వహణ కోసం ఆర్‌సీఏకు మాత్రమే బీసీసీఐ లేఖ పంపింది.
కానీ సవాయి మాన్సింగ్ స్టేడియం నుంచి మాకు ఎంఓయూ లేదని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఏంఓయూ లేకపోతేనేం.. ప్రతీ మ్యాచ్‌కు జిల్లా పరిషత్‌కు రెంట్ చెల్లిస్తున్నారు? కదా?’అని జైదీప్ ప్రశ్నించారు.
ప్రస్తుతం జైదీప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్ పై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ పై రెండు సీజన్ల నిషేదాన్ని విధించారు.