IPL 2023, CSK Vs RR: చెన్నైను చిత్తు చేసిన రాయల్స్
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది.

RR
IPL 2023, CSK Vs RR: ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాటర్లలో డేవాన్ కాన్వే (50; 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం చేయగా అజింక్యా రహానే(31; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆఖర్లో ధోని (32 నాటౌట్; 17 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా(25 నాటౌట్; 15 బంతుల్లో 1ఫోరు, 2సిక్స్) లు జట్టును గెలిపించేందుకు విఫల యత్నం చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్, చాహల్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా, ఆడమ్ జంపా, సందీప్ శర్మ ఒక్కొ వికెట్ తీశారు.
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నిషేధించాలి.. తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల డిమాండ్..
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్ బట్లర్(52; 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్థశతకం బాదగా, దేవదత్ పడిక్కల్(38; 26 బంతుల్లో 5ఫోర్లు) షిమ్రాన్ హెట్మెయర్(30 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టగా మోయిన్ అలీ ఓ వికెట్ తీశాడు.