Rajasthan Royals : ఐపీఎల్ చరిత్రలో అతి పెద్ద డీల్.. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) అమ్మకం ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది.
Rajasthan Royals Become IPL First Billion Dollar Team
- పూర్తైన రాజస్థాన్ రాయల్స్ అమ్మకం
- 1.63 బిలియన్ డాలర్లకు
- కొనుగోలు చేసిన కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం
Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ అమ్మకం ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్లకు జట్టును కొనుగోలు చేసినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.15300 కోట్లు) ఈ క్రమంలో 1 బిలియన్ డాలర్లకు అమ్ముడైన తొలి ఐపీఎల్ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.
కల్ సోమాని కన్సార్టియానికి వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త రాబ్ వాల్టన్, అలాగే ఎన్ఎఫ్ఎల్ జట్టు డెట్రాయిట్ లయన్స్‌లో మెజారిటీ వాటాలు కలిగిన హాంప్ కుటుంబం నుంచి ఆర్థిక మద్దతు లభించింది. ఐపీఎల్ 2026 ముగిసిన తరువాత కొత్త యాజమాన్యం బాధ్యతలను స్వీకరించనుంది.
SA-w vs IND-w : దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా జట్టు ఇదే..
గతంలో సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పిఎస్జి గ్రూప్ లక్నో సూపర్ జెయింట్స్‌ను 940 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా.. టొరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్‌లో 67 శాతం వాటాను 575 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఎవరీ కల్ సొమానీ?
అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త అయిన సోమాని ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్‌లో మైనారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఆయన 2021లోనే ఆర్ఆర్లో కొంత పెట్టుబడులు పెట్టారు. ఇక తాజాగా ఇప్పుడు మొత్తం 100 శాతాన్ని దక్కించుకున్నారు.
అరిజోనాకు చెందిన సొమానీ.. డేటా ప్రైవసీ, ఎడ్టెక్, క్రీడా సాంకేతికత తదితర రంగాల్లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఎంట్రప్రెన్యూర్. ఆయన ఇంట్రాఎడ్జ్, ట్రూయో, ఏఐ, అకాడెమియన్ వంటి సంస్థలకు పౌండర్. ఆయన మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్‌కు సహ-యజమాని, టిఎమ్ఆర్డబ్ల్యూ స్పోర్ట్స్, టిజిఎల్ గోల్ఫ్ లీగ్‌లలో తొలి పెట్టుబడిదారులలో ఒకరు.
