RCB vs GT : RCB vs GT : కోహ్లీ, ఫిల్ సాల్ట్ లపై రజత్ పాటిదార్ హాట్ కామెంట్స్.. గుజరాత్ పై ఓటమి తర్వాత..

గుజరాత్ చేతిలో ఓడిన త‌రువాత ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో జోష్‌లో ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు గుజ‌రాత్ టైటాన్స్ షాకిచ్చింది. బుధ‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు పై గుజ‌రాత్ 8 వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు ఓట‌మికి టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ల వైఫల్య‌మే ప్ర‌ధాన కార‌ణం అని ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్‌ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప‌వ‌ర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ విష‌యాన్నే అత‌డు ప్ర‌స్తావించాడు. ప‌వ‌ర్ ప్లేలో ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. గుజ‌రాత్ ముందు 190 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిలిపి ఉంటే ఫ‌లితం మ‌రో ర‌కంగా ఉండేద‌ని ర‌జ‌త్ పాటిదార్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

Virat Kohli : గుజ‌రాత్ టైటాన్స్ పై చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..

గుజరాత్ చేతిలో ఓడిన త‌రువాత ర‌జ‌త్ పాటిదార్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా త‌మ‌కు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయ‌న్నాడు. ‘నిజం చెబుతున్నా 200 ప‌రుగులు కాదు ప‌వ‌ర్ ప్లే త‌రువాత 190 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్ర‌త్య‌ర్థి ముందు ఉంచాల‌ని అనుకున్నాం. అయితే.. ఆరంభంలోనే ఎక్కువ వికెట్లు కోల్పోవ‌డం మా విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసింది. ఆట‌గాళ్ల ఇంటెంట్ బాగుంది. కానీ ప‌వ‌ర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవాల్సింది కాదు.’ అని పాటిదార్ అన్నాడు.

ప‌వ‌ర్ ప్లేలో ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి ఉంటే బాగుండేద‌న్నాడు. ఇక మ్యాచ్ సాగుతున్న కొద్ది ప‌రిస్థితులు చాలా మెరుగు అయ్యాయ‌ని తెలిపాడు. ఇక ల‌క్ష్యం చిన్న‌దైనా కూడా దాన్ని కాపాడుకునేందుకు బౌల‌ర్లు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశార‌ని మెచ్చుకున్నాడు. 18వ ఓవ‌ర్ వ‌ర‌కు మ్యాచ్‌ను తీసుకువెళ్లారంటేనే అద్భుతం అని అన్నాడు.

RCB vs GT : ఓట‌మి బాధ‌లో ఉన్న బెంగ‌ళూరుకు మ‌రో షాక్‌.. విరాట్ కోహ్లీకి గాయం.. నెక్ట్స్ మ్యాచ్ ఆడ‌తాడా లేదా ?

ఇక బ్యాటింగ్ జితేశ్ శ‌ర్మ‌, లియాన్ లివింగ్ స్టోన్‌, టిమ్ డేవిడ్‌లు చాలా బాగా ఆడారు. ఇది సానుకూలాంశం. ఇక మా బ్యాటింగ్ లైన‌ప్‌పై మాకు న‌మ్మ‌కం ఉంది. అని పాటిదార్ తెలిపాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బెంగ‌ళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో లియామ్ లివింగ్ స్టోన్ (54; 40 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. జితేశ్ శ‌ర్మ‌(33), టిమ్ డేవిడ్ (32)లు రాణించారు. ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7), దేవద‌త్ ప‌డిక్క‌ల్ (4), ర‌జ‌త్ పాటిదార్ (12), కృనాల్ పాండ్యా (5) లు విఫ‌లం అయ్యారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. సాయి కిశోర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అర్ష‌ద్ ఖాన్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ‌, ఇషాంత్ శ‌ర్మ‌లు త‌లా ఓ వికెట్ తీశారు.

RCB vs GT : బెంగ‌ళూరుపై మ్యాచ్ విన్నింగ్స్ ప్ర‌ద‌ర్శ‌న‌.. సిరాజ్ భావోద్వేగం..

అనంత‌రం జోస్ బ‌ట్ల‌ర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీ బాద‌గా, సాయి సుద‌ర్శ‌న్ (49), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (30నాటౌట్‌) దంచికొట్ట‌డంతో గుజ‌రాత్ 17.5 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది