Rajat Patidar : గుజరాత్ పై విజయం.. తప్పులు చేశాము.. సరిదిద్దుకుంటాం..ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కామెంట్స్ వైరల్..
గుజరాత్ పై విజయంలో తమ బౌలర్లు కీలక పాత్ర పోషించారని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.
Rajat Patidar key comments after RCB beat GT in IPL 2026 (pic credit@ipl)
- గుజరాత్ పై ఆర్సీబీ విజయం
- గెలిచినా కూడా మ్యాచ్‌లో తాము కొన్ని తప్పులు చేశామన్న రజత్ పాటిదార్
- వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడి
Rajat Patidar : ఐపీఎల్ 2026లో ఆర్సీబీ దూసుకుపోతుంది. శుక్రవారం చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం కావడం విశేషం. కాగా.. గుజరాత్ పై విజయంలో తమ బౌలర్లు కీలక పాత్ర పోషించారని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (100; 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టాడు. శుభ్‌మన్ గిల్ (32), జోస్ బట్లర్ (25) రాణించారు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మలు తలా ఓ వికెట్ సాధించారు.
Virat Kohli : బెథెల్‌కు నాకు మధ్య అదే చర్చ.. విరాట్ కోహ్లీ కీలక కామెంట్స్..
ఆ తరువాత 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లీ (81; 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), పడిక్కల్ (55; 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) లు అర్థశతకాలు బాదారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్ తలా ఓ వికెట్ సాధించారు.
బౌలర్లకు క్రెడిద్ ఇవ్వాల్సిందే..
గుజరాత్ పై విజయం సాధించడం పట్ల ఆర్సీబీ కెప్టెన్ రతజ్ పాటిదార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇదొక హోరాహోరీ మ్యాచ్ అని తాను అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికి కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నాడు. ఆర్సీబీ బౌలర్ల పై ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్ ప్లేలో భువీ, హేజిల్ వుడ్లు తమ అనుభవాన్ని అంతా ఉపయోగించి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారని చెప్పుకొచ్చాడు.
మిడిల్ ఓవర్లలో సుయాష్ చాలా బాగా బౌలింగ్ చేశాడని తెలిపాడు. ఇక డెత్ ఓవర్లలో.. రసిఖ్, భువీ, హేజిల్‌వుడ్ లు అద్భుతమైన యార్కర్లు వేశారన్నాడు. గుజరాత్ ను 200 లోపు లేదా 220 లోపు పరిమితం చేయడం తమ ప్రణాళిల్లో భాగం అని తెలిపాడు. ఇక లక్ష్య ఛేదనలో బెథెల్, కోహ్లీలు మెరుపు ఆరంభాన్ని అందించారని ప్రశంసించాడు. ఇక కోహ్లీ, పడిక్కల్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పిందన్నాడు.
ఇక దేవ్‌దత్ పడిక్కల్ ఇన్నింగ్స్ పై రజత్ పాటిదార్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్ చూడడానికి ఎంతో బాగుందన్నాడు. ఇక జట్టు విజయం సాధించినప్పటికి కూడా కొన్ని లోపాలు ఉన్నాయని తెలిపాడు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో మ్యాచ్‌ను క్లిష్టతరం చేసిందన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా పాఠాలు నేర్చుకున్నామని, తదుపరి మ్యాచ్‌ల్లో ఈ తప్పులను పునరావృతం కాకుండా చూస్తామన్నాడు.
