BCCI : బీసీసీఐకి కొత్త బాస్..!

బీసీసీఐ అధ్య‌క్షుడి స్థానంలో కీల‌క మార్పు జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

Rajeev Shukla May Become Acting BCCI President Sources

బీసీసీఐ అధ్య‌క్షుడి స్థానంలో కీల‌క మార్పు జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, 1983 ప్ర‌పంచ క‌ప్ గెలిచిన స‌భ్యుడు అయిన రోజ‌ర్ బిన్నీ త్వ‌ర‌లోనే త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

రోజ‌ర్ బిన్నీ ప‌ద‌వీకాలం ముగిసిన త‌రువాత ప్ర‌స్తుత ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఆంగ్ల మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు మూడు నెల‌ల పాటు ఆయ‌న తాత్కాలిక అధ్య‌క్షుడిగా ఉంటార‌ని ఆ వార్తాల సారాంశం.

బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. 70 ఏళ్ల నిండిన త‌ర్వాత ఆఫీసు బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలై 19తో బిన్నీ 70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. దీంతో పై నిబంధ‌న కార‌ణంగా ఆయ‌న బీసీసీఐ అధ్య‌క్షుడిగా కొన‌సాగ‌లేరు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజీనామా చేయ‌నున్నారు.

Glenn Maxwell : గ్లెన్ మాక్స్‌వెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌..

కొత్త అధ్య‌క్షుడి ఎన్నిక పూర్తి అయ్యే వ‌ర‌కు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌డ‌తారు. సెప్టెంబర్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) జ‌ర‌గ‌నుంది. ఆ స‌మావేశంలోనే బీసీసీఐ కొత్త అధ్య‌క్షుడిని ఎనుకోనున్నారు.

2022లో సౌర‌వ్ గంగూలీ స్ధానంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా రోజ‌ర్ బిన్నీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న హ‌యాంలో టీమ్ఇండియా వైట్‌బాల్ ఫార్మాట్‌లో రెండు ఐసీసీ టైటిళ్లు (టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024, ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025)ల‌ను గెలుచుకుంది. దేశీయ క్రికెట్‌ను బ‌లోపేతం చేయ‌డం కోసం ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చారు.

PBKS vs MI : మ్యాచ్ త‌రువాత శ్రేయ‌స్ అయ్య‌ర్ కోపం చూశారా? స‌హ‌చ‌ర ఆట‌గాడిపైనే..

బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ అయిన బిన్నీ టీమ్ఇండియా త‌రుపున 27 టెస్టులు, 72 వ‌న్డేల్లో ప్రాతినిథ్యం వ‌హించారు. టెస్టుల్లో 47 వికెట్లు తీయ‌డంతో పాటు 830 ప‌రుగులు సాధించారు. 72 వ‌న్డేల్లో 77 వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో పాటు 629 ర‌న్స్ చేశారు. 1983 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో 18 వికెట్లు తీసి టీమ్ఇండియా త‌రుపున‌ అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గానూ నిలిచాడు.