Glenn Maxwell : గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం.. వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్..
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Glenn Maxwell announces his retirement from ODI cricket
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీ20లపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. తన నిర్ణయం గురించి ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ జార్జ్ బెయిలీతో మాట్లాడినట్లు తెలిపాడు.
ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని మాక్స్‌వెల్ వెల్లడించారు. ‘జట్టు పరిస్థితులకు ఎలా స్పందిస్తుందో చూసి కొంచెం నిరాశ చెందుతున్నట్లుగా నాకు అనిపించింది. ఈ విషయమై నేను జార్జ్ బెయిలీతో మాట్లాడాను. అతడి ఆలోచనలు ఏంటి అని అడిగాను. మేము 2027 ప్రపంచకప్ గురించి మాట్లాడుకున్నాము. నేను అప్పటి వరకు ఆడబోనని అతడికి చెప్పాను. నా స్థానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్‌లు ఇచ్చి.. ఆ మెగాటోర్నీ వరకు వారు జట్టులో కుదురుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.’ అని బెయిలీతో చెప్పినట్లు మాక్స్‌వెల్ తెలిపారు.
PBKS vs MI : మ్యాచ్ తరువాత శ్రేయస్ అయ్యర్ కోపం చూశారా? సహచర ఆటగాడిపైనే..
36 ఏళ్ల మాక్స్‌వెల్ 149 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. 33.81 సగటుతో 3990 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 33 అర్థశతకాలు ఉన్నాయి.