Rashid Khan : అఫ్గానిస్తాన్ సెమీస్‌కు చేర‌గానే.. కెప్టెన్ ర‌షీద్ ఖాన్‌కు విదేశాంగ మంత్రి ఫోన్‌.. ఏమ‌న్నారంటే..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అఫ్గానిస్తాన్ జ‌ట్టు అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది.

Rashid Khan : అఫ్గానిస్తాన్ సెమీస్‌కు చేర‌గానే.. కెప్టెన్ ర‌షీద్ ఖాన్‌కు విదేశాంగ మంత్రి ఫోన్‌.. ఏమ‌న్నారంటే..?

Rashid Khan Receives Call From Taliban Minister After Afghanistan's Historic Win

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అఫ్గానిస్తాన్ జ‌ట్టు అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి ప‌టిష్ట జ‌ట్ల‌కు షాకులు ఇచ్చింది. ఇక మంగ‌ళ‌వారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్తాన్ డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.

కాగా.. క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అఫ్గానిస్తాన్ సెమీ ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. సెమీఫైన‌ల్‌కు చేర‌డంతో అఫ్గానిస్తాన్ ఆట‌గాళ్లు భావోద్వేగానికి లోనైయ్యారు. ఆదేశంలో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు.

ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్‌.. వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దైతే.. టీమ్ఇండియాకు గోల్డెన్ ఛాన్స్‌..

ఇదిలా ఉంటే.. బంగ్లాతో మ్యాచ్ గెల‌వ‌గానే అఫ్గానిస్తాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్‌కు ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఫోన్ చేసి అభినందించారు. అద్భుతంగా ఆడారంటూ ఆట‌గాళ్ల‌ను ఆయ‌న అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. అఫ్గానిస్తాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 న‌ష్టానికి 115 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43) టాప్ స్కోర‌ర్‌. బంగ్లా బౌల‌ర్ల‌లో రిషద్ హొస్సేన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముస్తాఫిజుర్‌, తస్కిన్ అహ్మద్ లు చెరో వికెట్ తీశారు. అనంత‌రం బంగ్లా ల‌క్ష్య ఛేద‌న‌కు దిగ‌గా.. ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. దీంతో మ్యాచ్‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించారు. బంగ్లా ల‌క్ష్యాన్ని 114 ప‌రుగులు నిర్ణ‌యించారు. అయితే.. బంగ్లా 17.5 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో అఫ్గాన్ 8 ప‌రుగుల తేడాతో గెలిచింది.

Afghanistan : సెమీస్‌కు చేరిన అఫ్గానిస్తాన్‌.. దేశంలో అంబ‌రాన్ని అంటిన సంబ‌రాలు.. వేల సంఖ్య‌ల్లో వీధుల్లోకి వ‌చ్చిన ఫ్యాన్స్‌..