Rohit Sharma: రోహిత్ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు – రవిచంద్రన్ అశ్విన్
ఇండియాతో తొలి టెస్టు తర్వాత ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు . రీసెంట్ గా జరిగిన టెస్టుల్లో కపిల్ దేవ్ కు సమంగా వికెట్లు...

Rohit Sharma
Rohit Sharma: ఇండియాతో తొలి టెస్టు తర్వాత ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు . రీసెంట్ గా జరిగిన టెస్టుల్లో కపిల్ దేవ్ కు సమంగా వికెట్లు తీసిన ఘనత సాధించిన అశ్విన్‌ను రోహిత్ శర్మ ఆల్ టైం గ్రేట్ గా పోల్చుతూ తెగ పొగిడేశాడు. రోహిత్ మాటలకు తాను ఎమోషనల్ అయిపోయానని చెప్తూ దానిని పోల్చడానికి మాటలు సరిపోవంటున్నాడు.
టెస్ట్ పర్‌ఫార్మాన్స్‌పై స్పందించిన రోహిత్ స్పిన్నర్‌గా అశ్విన్ చాలా టాలెంటెడ్ అని చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ పై అశ్విన్ సైతం పొగడ్తల వర్షం కురిపించాడు.
‘రోహిత్‌కు ఏం చెప్పాలో తెలియడం లేదు. నాకు కాంప్లిమెంట్స్ తీసుకోవడం రాదు. నిజంగా వాటికెలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతా. అలాంటప్పుడు పొగడ్తల గురించి అస్సలు మర్చిపోను. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో రోహిత్ నన్ను పొగిడేశాడు. ఇవాళ ఉదయం వరకూ ఎలా రియాక్ట్ అవ్వాలో నిజంగా తెలియలేదు. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గరే నువ్వు చాలా మంచివాడివి’ అని చెప్పానని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి అశ్విన్ అన్నాడు.
Read Also: ‘టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మది అద్భుతమైన ఎంట్రీ’
శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంక క్యాచ్ విరాట్ కోహ్లీ అందుకోవడంతో అశ్విన్ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 435 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కపిల్ దేవ్ 434 వికెట్ల రికార్డును దాటేసిన అశ్విన్ ముందుంది కేవలం అనిల్ కుంబ్లే 619 టెస్టు వికెట్లు మాత్రమే.