Ravi Shastri: రవిశాస్త్రిపై అజారుద్దీన్ ఫైర్.., బుమ్రా రావడమేంటండి?
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలపై మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఫైర్ అయ్యారు. టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలపై పలు ప్రశ్నలు సంధించారు.

Team India
Ravi Shastri: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలపై మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఫైర్ అయ్యారు. టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలపై పలు ప్రశ్నలు సంధించారు. టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఓడిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రవిశాస్త్రి, కోహ్లీలు హాజరుకాకపోవడం.. బౌలర్ బుమ్రాను పంపించడంపై విమర్శలు గుప్పించారు.
మీడియా ఛానల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి లేదా కోహ్లీ .. హాజరుకావాల్సిందని.. బుమ్రా హాజరుకావడాన్ని అజారుద్దీన్ తప్పుపట్టారు. ఇదే రకంగా ఆమోద్యయోగం కాదు. నా అభిప్రాయంలో హెడ్ కోచ్ మీడియా సమావేశానికి హాజరుకావాలి, ఒకవేళ విరాట్ హాజరుకావాలని లేకుంటే.. కోచ్ రవిశాస్త్రి మాత్రం కచ్చితంగా ప్రెస్ కాన్ఫిరెన్స్‌కు హాజరుకావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
మ్యాచ్‌లు గెలిచినప్పుడే ప్రెస్ కాన్ఫిరెన్స్‌కు హాజరుకావడం కాదు, ఓటమిపై కూడా వివరణ ఇవ్వాలని, బుమ్రాను ప్రెస్ కాన్ఫరెన్స్‌కు పంపడం సరికాదని చెప్పుకొచ్చారు. మీడియా సమావేశానికి కెప్టెన్ లేదా కోచ్ రావాలని, కనీసం కోచింగ్ స్టాఫ్‌లో ఎవరో ఒకరు ఉండాలని అన్నారు. వారిద్దరూ మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సిద్ధంగా లేరని ఓటమి పట్ల సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు అజహర్.
……………………………………. : 2016కు ముందు ఉస్మానియా పీహెచ్ డీ ప్రవేశాలు రద్దు
ఇద్దరిలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని… రెండు మ్యాచ్‌లు ఓడినంత మాత్రాన సిగ్గుపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వైఫల్యంపై బుమ్రా నుంచి సమాధానం ఆశించలేమని అన్నారు.