Ravichandran Ashwin : టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అతడు ప్రాతినిధ్యం వహించాడు. ఇక పై తాను విదేశీ లీగ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.
కాగా.. ఐపీఎల్ నుంచి రిటైర్‌మెంట్ కావడానికి గల కారణాలను అశ్విన్ (Ravichandran Ashwin) తాజాగా వెల్లడించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. మూడు నెలల పాటు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేనని చెప్పాడు. అందుకు తన శరీరరం సహకరించదన్నాడు.
PV Sindhu : BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్న పీవీ సింధు.. వరల్డ్ నంబర్ 2 పై విజయం
‘వాస్తవానికి ఇంకో సీజన్ ఆడడం గురించి ఆలోచించాను. అయితే.. మూడు నెలల పాటు కఠినమైన క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేను. దీంతో రిటైర్‌మెంట్ కావాలని నిర్ణయించుకున్నాను.’ అని అశ్విన్ చెప్పాడు. ధోని నిజంగా గ్రేట్ అని చెప్పాడు. అతడి ఫిట్‌నెస్ చూసి తాను ఆశ్చర్యపోతుంటానని చెప్పుకొచ్చాడు.
వయసు పెరుగుతున్న కొద్ది ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీలు ఆడడం కష్టం అని అన్నాడు. మ్యాచ్‌ల కోసం ఎక్కువగా ప్రయణాలు చేయాలి. కొన్నిసార్లు ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. అందుకు మన శరీరం సహకరించాలి అని అశ్విన్ అన్నాడు.
ఐపీఎల్‌లో 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అశ్విన్ అరంగ్రేటం చేశాడు. తన కెరీర్‌లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతడు మొత్తం 221 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 30.22 సగుతో 187 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 833 పరుగులు సాధించాడు.