సూపర్ కింగ్స్ చేతికి అడ్డంగా దొరికిన జడేజా

జట్టులో ప్రత్యేకంగా ఏం జరిగిన ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఓ కొత్త వీడియోను పోస్టు చేసింది.

జట్టులో ప్రత్యేకంగా ఏం జరిగిన ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఓ కొత్త వీడియోను పోస్టు చేసింది.

జట్టులో ప్రత్యేకంగా ఏం జరిగిన ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఓ కొత్త వీడియోను పోస్టు చేసింది. ఇందులో చెన్నై జట్టు స్పిన్నర్ రవీంద్రజడేజా సూపర్ కింగ్స్ ముందు అడ్డంగా బుక్కయిన వీడియోను ఉంచింది. ఎప్పటికప్పుడు కొత్త గెటప్స్ లో కనిపించేందుకు ప్రయత్నించే జడేజా ఈ సారి బ్రౌన్ కలర్ గడ్డంతో కనిపించేందుకు సిద్ధమైయ్యాడు. 
Read Also : పీకేఎల్ చరిత్రలో టాప్ 2 ప్లేయర్, తెలుగు టైటాన్స్ హీరో

ఈ మేర ప్రాక్టీస్ సెషన్ కు బ్రౌన్ కలర్ గడ్డంతో హాజరయ్యాడు. అది చూసిన జట్టు సభ్యులంతా ధోనీతో సహా ఆటపట్టించడం మొదలుపెట్టారు. మైదానంలో డ్రెస్సింగ్ రూమ్ లో గడ్డం పట్టుకుని ఏదో ఒకటి అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ‘సే హలో టూ సర్ జడ్డూస్ వన్ డే బ్రౌన్ మాన్’ ఒక్క రోజు బ్రౌన్ మనిషి సర్ జడేజాకి హలో చెప్పండి అని ట్వీ్ట్ చేసింది. 

చెన్నై ఆడిన ఆఖరి మ్యాచ్ లో హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజాలు కష్టపడి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను కట్టడి చేయగలిగారు. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లలోని స్పిన్నర్లు బాగా కష్టపడ్డారు. లీగ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 9 మంగళవారం మరోసారి చెపాక్ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. 

 

Read Also : ఆ కారణంతోనే మేం ఓడిపోతున్నాం: డివిలియర్స్