IPL 2024 : వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీకి బిగ్ షాక్..

ఆర్సీబీ మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్ లలో ఆ జట్టు ఓడిపోయింది.

IPL 2024 : వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీకి బిగ్ షాక్..

Glenn Maxwell

Updated On : April 16, 2024 / 12:58 PM IST

IPL 2024 Glenn Maxwell : ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కలిసి రావడం లేదు. దాదాపు ఆ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైనట్లే. ఈ సీజన్ లో ఆర్సీబీ మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్ లలో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ జట్టు నుంచి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తాత్కాలికంగా వైదొలుగుతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని అతను ఆర్సీబీ జట్టు కెప్టెన్ డు ప్లెసిస్, కోచ్ కు చెప్పాడు. హైదరాబాద్ మ్యాచ్ కంటే ముందే ఈ విషయాన్ని మాక్స్‌వెల్ వారికి చెప్పడంతో అతని స్థానంలో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విల్ జాక్స్ ను తుది జట్టులో చేరారు.

Also Read : Dinesh Karthik : వరుస బౌండరీలతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను వణికించిన దినేశ్ కార్తీక్.. వీడియో వైరల్

గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ – 2024 సీజన్ లో అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యాడు. మాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడంటూ బౌండరీల వర్షంతో స్టేడియం దద్దరిల్లేది. కానీ, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన మాక్స్‌వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్లు అయ్యాడు. దీంతో హైదరాబాద్ మ్యాచ్ కు ముందే కెప్టెన్, కోచ్ వద్దకు వెళ్లి తాను తాత్కాలికంగా జట్టును వైదొలుగుతున్నట్లు మాక్స్‌వెల్ చెప్పినట్లు తెలిసింది.

Also Raed : Varsha Bollamma : మళ్ళీ RCB ఓటమి.. హార్ట్ బ్రేక్ అయింది అంటున్న వర్ష బొల్లమ్మ..

సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర పరాజయం తర్వాత మాక్స్‌వెల్ మీడియాతో మాట్లాడాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయాను.. పవర్ ప్లే తర్వాత మా జట్టు వైఫల్యాలు ఎదుక్కొంటుంది.. బ్యాట్ తో నా ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడే నేను ఫిట్ గా తిరిగొస్తా. నేను కేవలం తాత్కాలికంగానే టోర్నీకి దూరమవుతున్నా.. టోర్నీలో ఆర్సీబీ జట్టుకు నా అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్‌వెల్ చెప్పాడు.