IPL 2025: ఆర్సీబీ కీలక నిర్ణయం.. ఆ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి నియామకం!

ఐపీఎల్ 2025కు ఆర్సీబీ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో 2025 సీజన్ కోసం ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఓంకార్ సాల్విని నియమించింది. సాల్వి ప్రస్తుతం ముంబై రంజీ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్నారు.

IPL 2025: ఆర్సీబీ కీలక నిర్ణయం.. ఆ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి నియామకం!

Omkar Salvi

Updated On : November 18, 2024 / 2:13 PM IST

CB Fast Bowling Coach Omkar Salvi: ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సిద్ధమవుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారిగా టోర్నీ విజేతగా నిలవలేకపోయిన ఆర్సీబీ.. 2025 ఐపీఎల్ ట్రోపీపై కన్నేసింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ టోర్నీ విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్న ఆ జట్టు యాజమాన్యం.. కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో 2025 సీజన్ కోసం ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఓంకార్ సాల్విని నియమించింది. సాల్వి ప్రస్తుతం ముంబై రంజీ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్నారు.

Also Read: AUS vs IND Test Series: విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఆస్ట్రేలియా సిరీస్ చివ‌రిదా.. గంగూలీ ఏం చెప్పాడంటే?

దేశవాళీ క్రికెట్ కోచింగ్ లో ఓంకార్ సాల్వి పేరున్న వ్యక్తి. 2023-24 రంజీ ట్రోఫీకోసం ముంబై జట్టు ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. అతని కోచింగ్ లో ఆ జట్టు ఎనిమిది సంవత్సరాల తరువాత రంజీ ట్రోపీని గెలుచుకోవడంలో విజయవంతమైంది. అంతేకాక.. సాల్వి కోచింగ్ లో ముంబై జట్టు ఇరానీ కప్ ను కూడా గెలుచుకుంది. 27ఏళ్ల తరువాత ముంబై  జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలచుకుంది. అయితే, ఆర్సీబీ వర్గాల సమాచారం ప్రకారం.. ఓంకార్ సాల్వి దేశవాళీ సీజన్ ముగిసిన తరువాతే ఆర్సీబీలో చేరుతాడని తెలుస్తోంది. ఎందుకంటే సాల్వికి వచ్చే ఏడాది మార్చి వరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ తో ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఓంకార్ సాల్వీకి ప్లేయర్ గా అనుభవం లేదు. 2025 సంవత్సరంలో రైల్వేస్ తరపున ఒకేఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. అతను తన కెరీర్ లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ, అతను కోచ్ గా మంచి పేరుప్రతిష్టలు గడించాడు. ఈ ఏడాది అతని కోచింగ్ లో ముంబై రంజీ ట్రోపీ ఎల్తెట్ గ్రూప్ లో మూడో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్ లు ఆడి 22పాయింట్లు సాధించింది. సాల్వీ గతంలో ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు.