RCBvsRR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం ఓపికగా ఎదురుచూసినప్పటికీ వరుణుడు వాయిదాల పద్ధతిలో విరుచుకుపడ్డాడు. రాత్రి 11గంటలు దాటాక కాసేపు శాంతించడంతో ఒక్కో జట్టుకు 5ఓవర్లు కేటాయించి మ్యాచ్ మొదలుపెట్టారు. 

మరో సారి వర్షం రావడంతో మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేశారు. అప్పటికే బెంగళూరు ఇన్నింగ్స్ పూర్తయిపోయింది. కోహ్లీ జట్టు 7వికెట్లు నష్టపోయి 62 పరుగులు చేయగలిగింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 3.2 ఓవర్లలో 41/1పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ సమయంలో వర్షం మరలా కురుస్తుండటంతో మ్యాచ్ కొనసాగే పరిస్థితులు కనిపించక రద్దు చేశారు అంపైర్లు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. 

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ ఒక్క పాయింట్ ఏ జట్టుకు లాభం చేకూర్చదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభించిన డివిలియర్స్ (10: 4 బంతుల్లో 2ఫోర్లు), విరాట్ కోహ్లి (25: 7 బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)  తొలి ఓవర్‌లోనే వరుణ్ అరోన్ బౌలింగ్‌లో బెంగళూరు ఓపెనర్లు 23 పరుగులతో శుభారంభాన్నిచ్చారు.ఆ తర్వాతి ఓవర్లోనే మరోసారి శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ అవుట్ అయిన కోహ్లీతో పాటు బెంగళూరు బ్యాట్స్ మెన్ వరుసపెట్టారు. 

 స్టాయినిస్ (0), క్లాసెన్ (6), గుర్‌కీరత్‌మన్ (6), పార్థివ్ పటేల్ (8), పవన్ నేగి (4)తో సరిపెట్టుకున్నారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్(28; 13బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సులు), లియాంమ్ లివింగ్ స్టోన్(నాటౌట్ 11; 7బంతుల్లో 1ఫోర్, 1 సిక్సు)చేసేసరికి మరోసారి వర్షం మొదలైంది.