టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ తలనొప్పిగా మారాడని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అయితే ఆ తలనొప్పి మంచిదేనని చెప్పుకొస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో చక్కటి ఫామ్ కనబరుస్తున్న రిషబ్ పంత్… ఐసీసీ వరల్డ్ కప్ 2019కు జట్టులో చోటు దక్కించుకునే అర్హతలు సంపాదించాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి విదేశీ పర్యటనలు మొదలుపెట్టిన పంత్.. ఫిబ్రవరి 24నుంచి సొంతగడ్డపైనే మొదలుకానున్న ఐదు వన్డేలు, రెండు టీ20లకు తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడేశాడట.
‘పంత్ మమ్మల్ని చిక్కుల్లో పడేశాడు. అతనో తలనొప్పిగా మారాడు. గతేడాది నుంచి ఇప్పటికీ అతనిలో చాలా మార్పును గమనించాం. దాంతో పాటు అతను ఇంకా ఎక్కువ అనుభవం, ఇంకొంచెం మెచ్యూరిటీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అందుకనే భారత్-ఏ జట్టు తరపున ఆడిస్తున్నాం’ అని వివరించారు.
పంత్ ఇంకా లేతగా ఉన్నాడు. మరింత అనుభవం సాధిస్తే అంతర్జాతీయ జాతీయ జట్టులో రాణిస్తాడనే నమ్మకమున్నట్లు ఎమ్మెస్కే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ధోనీకి ప్రత్యామ్నాయంగా జట్టులో స్థానం దక్కించుకుంటున్న పంత్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లలో ధోనీ ఉండగానే తాను ఓ టాపార్డర్ ప్లేయర్‌గా స్థానం దక్కించుకున్నాడు.