పంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లే.. ఇది వినండి

పంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లే.. ఇది వినండి

Updated On : April 1, 2019 / 7:27 AM IST

గతేడాది ఐపీఎల్ సీజన్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన రిషబ్ పంత్.. 2019 ఐపీఎల్ సీజన్‌లో అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే టీమిండియా భవిష్యత్ వికెట్ కీపర్‌గా పేరొందుతున్న పంత్.. శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 

టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. సాధారణంగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ వికెట్ల వెనుక ఉండి బ్యాట్స్‌మన్ కామెంట్లు విసిరే పంత్.. కోల్‌కతా బ్యాట్‌మన్ స్ఫూర్తి కలిగించేలా వ్యాఖ్యలు చేశాడు. సందీప్ లాంచనె బౌలింగ్‌ చేస్తున్న నాలుగో ఓవర్లో రాబిన్ ఊతప్ప బ్యాటింగ్ చేస్తున్నాడు. వెనకు నుంచి పంత్.. ‘యే తో వైసే భీ చౌకా హై'(ఇది కూడా ఫోర్ వెళ్తుంది) అంటోన్న వ్యాఖ్యలు స్టంప్ మైక్స్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. 

ఆ తర్వాతి బాల్‌కే ఊతప్ప ఫోర్ బాదడంతో పంత్ ఫిక్సింగ్ చేశాడంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టు మ్యాచ్‌లో పంత్ అనుమానస్పదంగా 15 బంతులు ఆడి 11పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు షాట్‌ల మీదే గురిపెట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించే.. పంత్ ఈ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేశాడు.  

ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ.. కోల్‌కతాలు సమాన స్కోరు సాధించాయి. మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఢిల్లీ 11 పరుగులు, కోల్‌కతా 7పరుగులు సాధించాయి. ఫలితంగా ఢిల్లీ విజయం దక్కించుకుంది.