తొలిసారి: గర్ల్ ఫ్రెండ్‌తో రిషబ్ పంత్

టీమిండియా క్రికెటర్‌గా తొలి విదేశీ పర్యటన అయినప్పటికీ అరుదైన రికార్డులు బ్రేక్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు పంత్. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ధోనీ వారసుడిగా పేరొందిన ఈ యువ క్రికెటర్ సోషల్ మీడియాలోనూ తనదైన హవా నడిపిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన గర్ల్ ఫ్రెండ్‌ ఫొటోను పోస్టు చేసి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. 

అంతేకాదు, ఆ ఫొటోతో పాటుగా ‘నాకు నిన్ను సంతోషంగా ఉంచడమే పని. ఎందుకంటే నేను సంతోషంగా ఉండటానికి కారణం నువ్వు మాత్రమే’ అంటూ కామెంట్ పోస్టు చేశాడు. 

 

ఇప్పటికే పంత్ గర్ల్ ఫ్రెండ్ గురించి వెతికేసిన నెటిజన్లు ఆమె పేరు ఇషా నేగి అని తాను ఒక ఎంట్రప్రెన్యూర్, ఇంటీరియర్ డెకర్ డిజైనర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 

 

మరో వైపు అదే ఫొటోను ఇషా నేగి కూడా పోస్టు చేసింది. దాని కింద తన మనసులో మాట ఉంచుతూ.. ‘మై మాన్, మై సోల్ మేట్, మై బెస్ట్ ఫ్రెండ్, ద లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ కామెంట్ రాసింది. 

ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు ఫార్మాట్ ఆడిన పంత్.. ఉప ఖండంలో  200కు పైగా పరుగులు చేసి 20 క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తంలో 350 పరుగులు చేసిన పంత్ రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. వన్డే జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అనంతరం స్వదేశానికి చేరుకున్నాడు.