Dhruv Jurel ruled out : దులీప్ ట్రోఫీ సెమీస్‌కు ధ్రువ్ జురెల్ దూరం.. అతడి స్థానంలో ఎవరంటే..?
దులీఫ్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్‌లు గురువారం (సెప్టెంబర్ 4) నుంచి ప్రారంభం కానున్నాయి. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel ruled out)..

Dhruv Jurel ruled out of Duleep Trophy 2025 semis
Dhruv Jurel ruled out : దులీప్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్‌లు గురువారం (సెప్టెంబర్ 4) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ జోన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అనారోగ్యం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. 24 ఏళ్ల ఈ ఆటగాడు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో అతడు సెమీ ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడని (Dhruv Jurel ruled out) సెలక్టర్లు తెలిపారు. అతడి స్థానంలో విదర్భ రంజీ కెప్టెన్ అక్షయ్ వాద్కర్‌ను ఎంపిక చేశారు.
2024-25 రంజీ ట్రోఫీ విజేతగా విదర్భ నిలవడంలో అక్షయ్ వాద్కర్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో అతడు 722 పరుగులు సాధించాడు. అలాగే వికెట్ కీపర్‌గానూ (24 డిస్మిసల్స్) సత్తా చాటాడు. ఒత్తిడిలోనూ ఎంతో పరిణితో బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. ఇక 61 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 49 సగటుతో 3865 పరుగులు సాధించాడు.
2025 దులీప్ ట్రోఫీ కోసం సెంట్రల్ జోన్ జట్టు..
రజత్ పాటిదార్ (కెప్టెన్), అక్షయ్ వాడ్కర్, ఆర్యన్ జుయల్, డానిష్ మలేవార్, సంజీత్ దేశాయ్, యశ్ ఠాకూర్, ఆదిత్య ఠాకరే, దీపక్ చాహర్, సరాంశ్ జైన్, ఆయుష్ పాండే, శుభమ్ శర్మ, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్ .
స్టాండ్‌బై ఆటగాళ్లు..
మాధవ్ కౌశిక్, యువరాజ్ చౌదరి, మహిపాల్ లోమ్రోర్, కుల్దీప్ సేన్, ఉపేంద్ర యాదవ్
Bronco Test : టీమ్ఇండియా ఆటగాళ్లకు ఊరట..! బ్రాంకో టెస్టు లేనట్లేనా?
ఫైనల్ ఎప్పుడంటే ?
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు చెందిన మైదానాల్లో రెండు సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి సెమీస్‌లో సౌత్ జోన్, నార్త్ జోన్ జట్ల మధ్య జరగనుండగా రెండో సెమీస్ వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు సెమీస్ మ్యాచ్‌లు గురువారం నుంచి ఆదివారం వరకు జరగనున్నాయి. ఇక గెలిచిన జట్లు సెప్టెంబర్ 11 నుంచి మొదలయ్యే ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షప్రసారం చేసేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది.