Riyan Parag delivers most bizarre delivery of all time before umpire adjudges it a no ball
టీమ్ఇండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా తనని తాను నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. రెండో టీ20 మ్యాచులో అతడు వింత బౌలింగ్ యాక్షన్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఢిల్లీ వేదికగా బుధవారం రెండో టీ20 మ్యాచులో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసేందుకు పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన రియాన్ పరాగ్ చేతికి బంతిని ఇచ్చాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. పరాగ్ వేసిన తొలి బంతిని బంగ్లా సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో పరాగ్ కాస్త అసంతృప్తికి గురి అయ్యాడు.
Ratan Tata : రతన్ టాటాకు క్రీడా లోకం నివాళులు.. అసలైన భారత రతనాన్ని కోల్పోయాం..
ఆ తరువాత రెండు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాడు. బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టాలని భావించిన పరాగ్.. నాలుగో బంతిని లసిత్ మలింగ శైలిలో బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. స్లింగ్లింగ్ డెలివరీగా సంధించాడు. అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్ మదన్ గోపాల్ థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. రిప్లేలో అది బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా తేలింది.
బంతిని వేసే సమయంలో బ్యాక్ ఫుట్ ట్రామ్‌లైన్ వెలుపల ఉంది. అందుకునే థర్డ్ అంపైర్ బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో బంగ్లాకు ఫ్రీ హిట్ లభించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74 ), రింకూ సింగ్(29 బంతుల్లో 53 ) మెరుపు అర్థశతకాలు సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది.
What was that Riyan Parag ? 🤣🤣#INDvsBAN pic.twitter.com/JAOTn2mLZM
— sajid (@NaxirSajid32823) October 9, 2024