Surya Kumar Yadav : హార్దిక్‌కు కావాలనే బౌలింగ్ ఇవ్వలేదు.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఓ అద్భుతం : కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
టీమ్ఇండియా జోరు కొనసాగిస్తోంది.

Suryakumar comments after India beat Bangladesh in 2nd t20
Surya Kumar Yadav : టీమ్ఇండియా జోరు కొనసాగిస్తోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో 86 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో నామమాత్రమైన మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల అర్థశతకాలు బాదారు. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 135 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలా ఓ వికెట్ సాధించారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ చూశారా.. వీడియో వైరల్
ఇక మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. రెండో టీ20 విజయంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడన్నారు. టాప్ ఆర్డర్ విఫలమైనా.. జట్టు 41/3తో కష్టాల్లో ఉన్న సమయంలో నితీశ్‌కుమార్, రింకూ సింగ్‌లు అద్భుతంగా ఆడారని సూర్య కొనియాడారు.
ఈ మ్యాచ్‌లో తాను ఎలా కోరుకున్నానో అలాగే వారిద్దరూ ఆడినట్లు సూర్య తెలిపాడు. ఇక బౌలర్లను కూడా పరీక్షించాలని అనుకున్నాము. అందుకనే హార్దిక్‌కు బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. ఈ క్రమంలోనే ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాను. ఇది నితీశ్ రోజు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాము అని సూర్య చెప్పాడు.
Womans T20 World cup : మహిళా క్రికెటర్ రాధా యాదవ్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్