Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ చూశారా.. వీడియో వైరల్

తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లో 76 పరుగులు చేశాడు.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ చూశారా.. వీడియో వైరల్

Hardik Pandya

Updated On : October 10, 2024 / 10:29 AM IST

IND vs BAN T20 Match: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ బుధవారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్ లోనూ విజేతగా నిలవడంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బంగ్లా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్  బ్యాటింగ్ ప్రారంభించింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ సుడిగాలి ఇన్సింగ్ ఆడటంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 221 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు భారీ పరుగుల లక్ష్య చేధనలో విఫలమైంది.

Also Read : Womans T20 World cup : మహిళా క్రికెటర్ రాధా యాదవ్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్

ఏ దశలోనూ బంగ్లాదేశ్ జట్టు పోటీ ఇవ్వలేక పోయింది. మూడో ఓవర్లోనే ఎమాన్ ఔట్ అయ్యాడు. మహ్మదుల్లా (41) మినహా మిగిలిన బంగ్లా బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో నిర్ణీత ఓవర్లలో 135 పరుగులు మాత్రమే బంగ్లా బ్యాటర్లు చేయగలిగారు. ఫలితంగా భారత్ జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది.

 

బంగ్లాదేశ్ జట్టు 93 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో రిషద్  హొస్సేన్ భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చిన హార్దిక్ పాండ్యా డ్రైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా హార్ధిక్ హార్దిక్ అంటూ స్టేడియం హోరెత్తింది. హార్దిక్ పట్టిన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హార్దిక్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.