Rohit Sharma: రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. 6 వేల క్లబ్లో హిట్‌మ్యాన్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

Rohit Sharma
Rohit Sharma: హిట్‌మ్యాన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు.
We ? you 3000×2, ??! #OneFamily #SRHvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 @ImRo45 pic.twitter.com/xHX3Lldyg8
— Mumbai Indians (@mipaltan) April 18, 2023
ఈ మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. 6 వేల పరుగుల క్లబ్లో రోహిత్ కన్నా ముందుగా బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌లు ఉన్నారు.
రోహిత్ శర్మ 227 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగుల మైలురాయిని చేరుకోగా అందరి కంటే వేగంగా డేవిడ్ వార్నర్ 165 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇక విరాట్ కోహ్లి 189, శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 18 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో ఔటైయ్యాడు.
IPL 2023, SRH vs MI: లోకల్ బాయ్ తిలక్ వర్మ దూకుడు ..Live Updates