Rohit Sharma: ఇది టైం కాదు.. టెస్టు కెప్టెన్సీ గురించి మరిచిపోండి – రోహిత్ శర్మ
టీమిండియా రెగ్యూలర్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫిబ్రవరి 6నుంచి వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు సారథ్యం వహించనున్నడు. డిసెంబర్ 2021న కోహ్లీ రాజీనామా అనంతరం ఆడుతున్న...

-Rohit-Sharma
Rohit Sharma: టీమిండియా రెగ్యూలర్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫిబ్రవరి 6నుంచి వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు సారథ్యం వహించనున్నడు. డిసెంబర్ 2021న కోహ్లీ రాజీనామా అనంతరం ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. గతంలో 10 వన్డేలకు కెప్టెన్సీ వహించినా ఫుల్ టైం కెప్టెన్ గా ఇదే తొలి సిరీస్.
మరో వైపు టెస్టు కెప్టెన్సీకి కూడా విరాట్ గుడ్ బై చెప్పేయడంతో రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్ కు కూడా కెప్టెన్ అవుతాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవి నేరుగా రోహిత్ కు చేరడంతో ఇలా రెస్పాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం అతనికి దానిపై ఫోకస్ లేదని ఆ ఆలోచన కూడా చేయలేదని చెప్పాడు.
‘దానికొక సమయం ఉంది. నా ఫోకస్ అంతా పరిమిత్ ఓవర్ల క్రికెట్ మీదనే. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. మేం కొన్ని సిరీస్ లు ఓడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మేం తరచుగా ప్లేయర్లను మారుస్తూ ఉన్నాం. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ గురించి మర్చిపోండి. ఇప్పటి వరకూ నాకు ఆ ఆలోచన లేదు. వెస్టిండీస్, శ్రీలంక సిరీస్ లు ఉన్నాయి. వాటిపైనే ఫోకస్ చేయాలి’ అని వెస్టిండీస్ తో తొలి వన్డేకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ వేదికగా వెల్లడించాడు రోహిత్.
Read Also: కొలిక్కిచేరిన స్టీరింగ్ కమిటీ – మంత్రుల కమిటీ చర్చలు!
వన్డే కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన తర్వాత కోహ్లీ.. రోహిత్ కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాలి గాయం కారణంతో టెస్టు ఫార్మాట్ కు దూరంకాగ రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ టెస్టు ఫార్మాట్ కు వైస్ కెప్టెన్సీ వహించాడు.
టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీ కోసం రోహిత్ లేదా రాహుల్ లను పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ ఎవరైనా శ్రీలంకతో జరిగే సిరీస్ కు ముందే ప్రకటించాలని సెలక్షన్ కమిటీ, బీసీసీఐ ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు.