IND vs AUS : బాక్సింగ్ డే టెస్టుకు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. నెట్స్‌లో గాయ‌ప‌డ్డ రోహిత్ శ‌ర్మ‌..!

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది.

Rohit Sharma Injury Scare For India Ahead Of 4th Test against Australia

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. మూడు మ్యాచులు ముగిసే స‌రికి భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో కీల‌కమైన నాలుగో టెస్టు మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు కూడా మెల్‌బోర్న్‌కు చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లుపెట్టాయి. బాక్సింగ్ డే టెస్టులో విజ‌యం సాధించేందుకు రెండు జ‌ట్లు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది.

ప్రాక్టీస్ సెష‌న్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నెట్స్‌లో బంతిని ఎదుర్కొనే స‌మ‌యంలో అత‌డి ఎడ‌మ మోకాలికి బాల్ త‌గిలిన‌ట్లు తెలుస్తోంది. నొప్పి తీవ్రంగా ఉండ‌డంతో అత‌డు వెంట‌నే వైద్య సాయం కోరాడు. అత‌డి మోకాలికి ప‌ట్టి వేశారు. దీంతో రోహిత్ శ‌ర్మ ప్రాక్టీస్ ఆపేసి కుర్చీలో ఓ ప‌క్క‌గా కూర్చుకున్నాడు.

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ సూపర్ బౌలింగ్.. ముంబై తుది జట్టులో చోటుదక్కేనా?

అత‌డి గాయం తీవ్ర‌త పై ఇప్ప‌టికైతే స్ప‌ష్ట‌త లేదు. ఒకవేళ తీవ్ర‌గాయ‌మై అత‌డు నాలుగో టెస్టుకు దూరం అయితే మాత్రం అది భార‌త్ కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. ఇక శ‌నివారం నెట్స్‌లో కేఎల్ రాహుల్ చేతికి గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. కాగా.. వీరిద్ద‌రి గాయాల‌పై బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

అయితే.. నాలుగో టెస్టుకు మ‌రో నాలుగు రోజులు స‌మ‌యం ఉండ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు ఈ ఇద్ద‌రు కోలుకుంటార‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Ravichandran Ashwin : రెండు రోజులుగా అంతా గంద‌ర‌గోళంగా ఉంది.. అశ్విన్ రిటైర్‌మెంట్ పై భార్య ప్రీతి ఫ‌స్ట్ రియాక్ష‌న్‌..