IPL 2023: రోహిత్.. ఐపీఎల్ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో
ఐపీఎల్‌లో కొన్నిమ్యాచ్‌లకురోహిత్ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్.దీని వల్ల ఐపీఎల్ తరువాత జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రెష్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంటుందన్నాడు.

Rohit Sharma needs a little bit of a break from the IPL
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచులు ఆడగా కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ముంబై వరుస విజయాలు సాధించలేకపోవడానికి ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కూడా ఓ కారణం. రోహిత్ ఏడు మ్యాచ్‌లు ఆడి 135.07 స్ట్రైక్ రేట్‌తో 181 పరుగులు చేసాడు. అత్యధిక స్కోరు 65. ఒక్క మ్యాచులో మాత్రమే రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గట్లుగా ఆడాడు.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 55 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. దీని వల్ల ఐపీఎల్ తరువాత జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌కు రోహిత్ ప్రెష్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంటుందన్నాడు.
IPL 2023, GT vs MI: చేతులెత్తేసిన బ్యాటర్లు.. ముంబై పై గుజరాత్ ఘన విజయం
ప్రస్తుతం రోహిత్ శర్మ ఒత్తిడికి గురవుతున్నట్లు అనిపిస్తోంది. ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లకు రోహిత్ దూరంగా ఉంటే ముంబై ఇండియన్స్‌కు సైతం కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. దీంతో వారి ఆటతీరు కూడా మారుతుంది. ఈ సీజన్‌లో ముంబై జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. బౌలర్లు పదే పదే అవే తప్పులు చేస్తున్నారు. కొన్ని మ్యాచులకు వారిని పక్కన పెట్టాలి. ఇక బౌలర్లు కూడా తాము ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తించాలని గవాస్కర్ సూచించాడు. విశ్రాంతి అనంతరం ఐపీఎల్‌లో చివరి మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు రోహిత్ ఆడాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం రోహిత్ లయను అందుకోవడానికి ఆ మ్యాచ్‌లు ఉపయోగపడుతాయి అని గవాస్కర్ అన్నారు.